ఆర్ఆర్ఆర్.ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు.
దేశం మొత్తం కూడా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యేందుకు సర్వం సిద్ధం అయ్యింది.మరొక రెండు రోజుల్లోనే మన సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమ రిలీజ్ కానుంది.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ప్రకటించడంతో అందరు హ్యాపీ గా ఉన్నారు.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అన్ని చోట్ల జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.నిన్నటి వరకు నార్త్ ఇండియాలో ప్రొమోషన్స్ చేసిన టీమ్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రొమోషన్స్ చేయనుంది.

ఈ రోజుతో ప్రొమోషన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టనున్నారు.ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలలో టీమ్ రోజుకొక ఇంట్రెస్టింగ్ వార్త ప్రేక్షకులకు చెప్తూ ఈ సినిమాపై ఆసక్తి మరింత పెంచేస్తున్నారు.తాజాగా రాజమౌళి మరొక ఆసక్తికరమైన వార్త ప్రేక్షకులకు తెలిపాడు.ఈ సినిమాలో డైలాగ్ పోర్షన్ చాలా తక్కువుగా ఉందని తెలిపారు.

అలాగే ఎన్టీఆర్ డబ్బింగ్ విషయం చెబుతూ ఎన్టీఆర్ చాలా త్వరగా డబ్బింగ్ పూర్తి చేసాడని.తెలుగు డబ్బింగ్ కు కేవలం ఒక్కరోజు మాత్రం తీసుకున్నాడట తారక్.అలాగే హిందీ డబ్బింగ్ కు రెండు రోజులు, తమిళ్ డబ్బింగ్ కోసం మూడు రోజులు తీసుకున్నాడని రాజమౌళి తెలిపాడు.మొత్తం మీద ఈ సినిమా మొత్తం ప్రేక్షకులకు త్రిల్ ఇస్తుందని టీమ్ అంతా కూడా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.








