సంతానోత్పత్తిని ప్రోత్సహించడానికి చైనా చేస్తున్న పన్నాగం ఇదే!

జనాభా చాలదన్నట్టు చైనా తమ జనాభాను వీలైనంత వేగంగా పెంచేందుకు సిద్ధమౌతోంది.దీనిలో భాగంగా దేశంలోని 20 నగరాల్లో కొత్తతరం పెళ్లిళ్లు, సంతోనోత్పత్తి సంస్కృతిని ప్రోత్సహించే కార్యక్రమాలను షురూ చేసింది.

 This Is China's Plan To Promote Fertility! Latest News, Telugu Nri, Latest New-TeluguStop.com

దేశంలో సంతానోత్పత్తి రేటును పెంచడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు అక్కడి అధికారులు అధికారికంగా ప్రకటించారు.ఈ నేపథ్యంలో చైనా( China ) ఫ్యామిలీ ప్లానింగ్‌ అసోసియేషన్‌ సంస్థ దీనికి రంగం సిద్ధం చేసింది.

ఇందులో భాగంగా మహిళలు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలను కనేట్లు ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు గ్లోబల్‌ టైమ్స్‌(Global Times ) కథనంలో పేర్కొంది.

Telugu China, Times, Policy-Telugu NRI

ఈ ప్రాజెక్టు కింద సరైన సమయంలో యువతీయువకులకు పెళ్లిళ్లు అయ్యేట్లు చూస్తారు.అదేవిధంగా పిల్లల బాధ్యతలను భార్యభర్తలు పంచుకొనేలా వారిని ప్రోత్సహిస్తారు.పెళ్లికూతుళ్లకు చెల్లించే అధిక కట్నాలు అడ్డుకోవడం, ఇతర ఆచారాలను పరిరక్షించడం వంటివి ఈ కార్యక్రమ నేపథ్యంలో చేపట్టనున్నారు.

యువతరానికి పెళ్లి, పిల్లలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు డెమోగ్రాఫర్‌ హెయాఫు గ్లోబల్‌ టైమ్స్‌కు వెల్లడించడం జరిగింది.

Telugu China, Times, Policy-Telugu NRI

అవును, చైనాలోని చాలా రాష్ట్రాల్లో జననాల రేటును పెంచేందుకు ఆయా ప్రభుత్వాలు పుంజుకున్నాయి.ఈ క్రమంలో వారికి పన్నరాయితీలు, గృహాలపై సబ్సిడీలు, మూడో బిడ్డను కంటే రాయితీ విద్య వంటి పధకాలను ప్రవేశపెట్టి, ప్రజలను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు.1980-2015 వరకు చైనాలో వన్‌ఛైల్డ్‌ పాలసీని( One-child policy ) బలవంతంగా అమలు చేసిన సంగతి విదితమే.ఫలితంగా అక్కడ జననాల రేటు విపరీతంగా పడిపోతూ వచ్చింది.ఇటీవల కాలంలో ఇది ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అక్కడి ప్రభుత్వం పునరాలోచించింది.దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం దీనిని అడ్డుకోవడానికి చర్యలు చేపట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube