ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే 20 రోజుల్లో రక్తహీనత దూరం అవుతుంది తెలుసా?

రక్తహీనత( Anemia ) అనేది ఇటీవల రోజుల్లో అత్యధిక శాతం మందిని పట్టిపీడిస్తోంది.

పిల్లల నుంచి పెద్దల వరకు ఎందరో రక్తహీనత బారిన పడి నానా ఇబ్బందులు పడుతున్నారు.

రక్తహీనత అనుకున్నంత చిన్న సమస్య ఏమీ కాదు.దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పుగా మారుతుంటుంది.

అందుకే రక్తహీనత నుంచి బయట పడటం కోసం ఐరన్ టాబ్లెట్స్ ను వాడుతుంటారు.అయితే కొన్ని కొన్ని ఆహారాల ద్వారా కూడా రక్తహీనత సమస్యను నివారించుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ను ఖాళీ కడుపుతో తీసుకుంటే కేవ‌లం ఇర‌వై రోజుల్లోనే రక్తహీనత దూరం అవుతుంది.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హలీమ్ విత్తనాలు వేసుకోవాలి.

హలీమ్ విత్తనాల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

అలాగే ఒక గ్లాస్ వాటర్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసి బాగా కలిపి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఇలా నాన‌బెట్టుకున్న హలీమ్ విత్తనాల్లో( Halim seeds ) పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పుదీనా జ్యూస్ మరియు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన డ్రింక్ సిద్ధం అవుతుంది.

ఈ హలీమ్ డ్రింక్ ను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

దాంతో శ‌రీరానికి అవసరమయ్యే ఐరన్ పుష్కలంగా అందుతుంది.హిమోగ్లోబిన్( Hemoglobin ) శాతం చక్కగా ఇంప్రూవ్ అవుతుంది.ఫలితంగా రక్తహీనత సమస్య దూరం అవుతుంది.

Advertisement

కాబట్టి ఎవరైతే రక్తహీనత సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో వారు తప్పకుండా ఈ హలీమ్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.

జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య పరార్ అవుతుంది.

మరియు స్త్రీలలో నెలసరి సమస్యలు సైతం దూరం అవుతాయి.

తాజా వార్తలు