సాధారణంగా కొందరి నోరు తరచూ డ్రైగా( mouth is often dry ) మారుతుంటుంది.అందులోనూ ప్రస్తుత వేసవి కాలంలో ఈ సమస్య మరింత అధికంగా ఇబ్బంది పెడుతుంది.
నోటిలో లాలాజలం ( Saliva )ఉత్పత్తి సరిగ్గా కాకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.నోటిలో వచ్చే ఏదైనా వ్యాధికి ఇది సంకేతం కావచ్చు.
అందుకే ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.
నోరు తరచూ డ్రైగా మారుతుంది అంటే మీ శరీరానికి సరిపడా నీటిని అందించడం లేదని అర్థం.
డిహైడ్రేషన్ ( Dehydration )కారణంగా నోరు తరచూ పొడిబారిపోతుంటుంది.అందుకే బాడీని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.
అందుకు వాటర్ తో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి.ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్ గా మారుస్తాయి.
అలాగే నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి.
అలాగే కొందరు నోరు తరచూ డ్రై గా మారుతుందని మౌత్ వాష్ వాడుతుంటారు.
అయితే మౌత్ వాష్ లో ఆల్కహాల్ ఉపయోగించబడుతుంది.ఇది నోటిని మరింత పొడిగా మార్చేస్తుంది.
అందుకే నోరు పొడిబారడం సమస్య ఉంటే ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాష్ వాడాలి.ఇది నోటి తేమను ఏ మాత్రం ప్రభావితం చేయకుండా ఉంటుంది.
నోరు తరచూ డ్రైగా మారుతుంటే తప్పకుండా డ్రింకింగ్, స్మోకింగ్ అలవాట్లను మానుకోవాలి.ఎందుకంటే మద్యపానం, ధూమపానం వల్ల లాలాజల గ్రంధులు ప్రభావితమవుతాయి.దీంతో నోరు డ్రై గా మారడం, విపరీతమైన దాహం లాంటిది తీవ్రంగా మారతాయి.నిద్రలేమి, డిప్రెషన్, ఆందోళన వంటి వాటి వల్ల కూడా నోరు తరచూ ఎండిపోతుంటుంది.
అందుకే ఆయా సమస్యల నుంచి బయట పడేందుకు ప్రయత్నించాలి.
నోరు పదే పదే పొడిగా మారుతుంటే డైట్ లో సోంపు వాటర్ ను చేర్చుకోండి.వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేసి బాగా మరిగించి ఆ నీటిని చల్లగా మారిన తర్వాత సేవించాలి.ఈ వాటర్ ను తాగడం వల్ల నోరు తరచూ ఎండిపోకుండా ఉంటుంది.
ఇక కలబందతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్ ను తీసుకోవాలి.
ఇలా చేసినా కూడా నోరు తరచూ పొడిగా మారకుండా ఉంటుంది.