ఈ క్యాట్ మామూలు స్మార్ట్ కాదు.. ట్యాప్ ఎలా ఆన్ చేస్తుందో చూస్తే..

పిల్లులు( Cats ) చాలా తెలివైన జీవులు.ఇవి నేర్పిస్తే కష్టమైన పనులనైనా నేర్చుకోగలవు, వీటికి అద్భుతమైన జ్ఞాపకశక్తి కూడా ఉంటుంది.

ప్రాబ్లమ్‌ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఈ జీవులలో ఎక్కువే.కమ్యూనికేషన్ కోసం కూడా క్యాట్స్ అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి.

మనుషుల్లో ఒక చిన్న పిల్లోడికి ఎంతటి తెలివితేటలు ఉంటాయో పిల్లికి కూడా దాదాపు అదే స్థాయిలో తెలివితేటలు ఉంటాయి.

పిల్లులు కొత్త ఉపాయాలు నేర్చుకోగలవని, ఎక్కువ కాలం సమాచారాన్ని గుర్తుంచుకోగలవని, పజిల్స్ సాల్వ్ చేయగలవని స్టడీస్ లో కూడా తేలింది.ఇక పిల్లుల స్మార్ట్ నెస్ ను ఎప్పటికప్పుడు తెలియజేసే వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.ఆ వీడియోలలో పిల్లలు మనుషుల్లాగా తెలివిని ప్రదర్శిస్తూ ఆశ్చర్యపరుస్తుంటాయి తాజాగా అలాంటి ఒక వీడియో ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో వైరల్ గా మారింది.

Advertisement

రాగ్డోల్ ( Ragdoll )లేదా బిర్మాన్ జాతికి చెందిన ఒక పిల్లిని మనం వైరల్ వీడియోలో చూడవచ్చు.అది ఒక డ్రింకింగ్ వాటర్ క్యాన్ వద్ద వెనుక కాళ్లపై నిల్చుని ఉంది.తన ముందుకాళ్లను ఆ వాటర్ ట్యాప్ బటన్ మీద ఉంచింది.

తర్వాత ఓనర్ ఆ ట్యాప్ కింద ఒక గ్లాసు పెట్టగా.దానిని పిల్లి గమనించింది.

తర్వాత ట్యాప్ బటన్( Tap button ) నొక్కింది.గ్లాస్ నిండా వాటర్ పట్టేదాకా అంతే ఒత్తి పట్టుకుంది.

గ్లాసు నిండగానే వెంటనే తన కాలును బటన్ పైనుంచి తీసేసింది.గ్లాసు నిండుతుందా అనేది ఆ పిల్లి తన కళ్ళతో చూస్తూ భలేగా చెక్ చేసుకుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

మనుషులే ఏ విధంగా వాటర్ పడతారో సరిగ్గా ఆ విధంగానే ఈ పిల్లి చేసింది.కానీ తెలివికి ఆ గ్లాస్ పట్టుకున్న బాగా ముచ్చట పడింది.

Advertisement

అంతే కాదు దాని క్యూట్ వర్క్ చూసి నవ్వేసింది."వావ్, ఈ క్యాట్ చాలా స్మార్ట్, హార్డ్ వర్కర్, హెల్పర్" అని నెటిజన్లు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

@catworkers ట్విట్టర్ పేజీ పంచుకున్న ఈ వీడియోకు ఇప్పటికే 30 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు