చెక్కతో టెస్లా సైబర్‌ట్రక్ బిల్డ్ చేసిన వ్యక్తి.. మస్క్ రియాక్షన్ ఇదే..

తాజాగా ట్రూంగ్ వాన్ డావో అనే వియత్నామీస్ వుడ్ వర్కర్ టెస్లా సైబర్‌ట్రక్కుకు అద్భుతమైన వుడెన్ వెర్షన్ తయారు చేశాడు.అతను దీని తయారీ కోసం చేపట్టిన 100-రోజుల ప్రాజెక్ట్‌ను యూట్యూబ్‌లో డాక్యుమెంట్ చేసాడు.

 The Person Who Built The Tesla Cybertruck Out Of Wood This Is Elon Musk S React-TeluguStop.com

మెటల్ ఫ్రేమ్, ఎలక్ట్రిక్ మోటారు, బ్యాటరీలను ఉపయోగించి ఆ వాహనాన్ని మొదటి నుంచి ఎలా నిర్మించాడో చూపాడు.అనంతరం కస్టమ్-మేడ్ చెక్క పలకలతో మెటల్ ఫ్రేమ్‌ను కవర్‌ చేసి సైబర్‌ట్రక్కు లాంటి యాంగులర్ షేప్‌ను క్రియేట్ చేశాడు.

అద్దాలు, సీట్లు, లైట్లు, ఎక్స్ లోగో వంటి వుడెన్ డీటెయిల్స్ కూడా జోడించాడు.అతను సైబర్‌క్వాడ్ ( Cyberquad )అనే ఓ చిన్న ఎలక్ట్రిక్ ATV చెక్క వెర్షన్‌ను కూడా తయారు చేసి, దానిని ట్రంక్‌లో ఉంచాడు.

మొత్తం మీద ఇది టెస్లా సైబర్‌ట్రక్కును పోలి అద్భుతంగా కనిపించింది.వాన్ డావో తన కుమారుడితో కలిసి తన చెక్క సైబర్‌ట్రక్‌ని నడుపుతూ టెస్లా సీఈఓ అయిన ఎలాన్ మస్క్‌( Elon Musk )కి మెసేజ్ కూడా చేశాడు.సైబర్‌ట్రక్కు తాను, అతని అభిమానులు బిల్డ్ చేయాలనుకుంటున్న ఒక అట్రాక్టివ్ కారు అని వాన్ డావో అన్నాడు.తన మునుపటి చెక్క కారు ప్రాజెక్ట్‌ల నుంచి చాలా నేర్చుకున్నానని, టెస్లా దృష్టి, సామర్థ్యాలపై తనకు ఎంతో నమ్మకం ఉందని అన్నాడు.

వుడెన్ సైబర్‌ట్రక్‌ను మస్క్, టెస్లాకు ప్రశంసల చిహ్నంగా బహుమతిగా ఇచ్చాడు.

మస్క్ దృష్టిని ఆకర్షించాలనే ఆశతో వాన్ దావో తన ఎక్స్ ఖాతాలో తన వీడియో, మెసేజ్‌ను పోస్ట్ చేశాడు.కొంతసేపటికి మస్క్ తన పోస్ట్‌కి రిప్లై ఇచ్చాడు.“చాలా అభినందిస్తున్నా.” అని మస్క్ రిప్లై ఇచ్చారు.టెస్లా సైబర్‌ట్రక్( Tesla Cybertruck ) అనేక సవాళ్లను, ఆలస్యాన్ని ఎదుర్కొన్నందున, మస్క్ రియాక్షన్ వాన్ డావో పనికి అరుదైన గుర్తింపుగా చెప్పవచ్చు.

ఈ కారు నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది, అయితే గిగా టెక్సాస్ ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ఇటీవలే ప్రారంభమైంది.నెమ్మదిగా దీని ప్రొడక్షన్ జరగడానికి కారణం బ్యాటరీ సరఫరా సమస్యలే కారణమని మస్క్ ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube