ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో సినీనటుడు సప్తగిరి, పాండిచ్చేరి హోం మినిస్టర్ నమస్మివయం వేరువేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.
ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సినీ నటుడు సప్తగిరి మాట్లాడుతూ.
నూతన సినిమాలతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు సప్తగిరి తెలిపారు.శ్రీవారి దర్శనం ఎంతో అద్భుతంగా జరిగిందని,అందరూ బాగుండాలని శ్రీనివాసుని ప్రార్ధించినట్లు చెప్పారు.
త్వరలో గూడుపుఠాని, గోల్డ్ మాన్ లు సినిమాలు విడుదల కాబోతున్నాయన్నారు.అలాగే మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.