పొరపాటున కూడా పరమేశ్వరుడికి ఈ వస్తువులతో పూజ చేయకూడదు..?

త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడిని ఎంతో మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.

ఈ క్రమంలోనే స్వామివారి అనుగ్రహం పొందడం కోసం వివిధ రకాల పుష్పాలు ఫలాలు చేత స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు.

ఇలా చేయటం వల్ల స్వామి వారి కృప మనపై ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు.కానీ అన్ని దేవతల మాదిరిగా కాకుండా పరమేశ్వరుడికి పూజా విధానం ప్రత్యేకంగా ఉంటుంది.

పరమేశ్వరుడికి పూజ చేసే సమయంలో భక్తులు కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి.పరమేశ్వరుడి పూజలో కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు.

ఆ వస్తువులను ఉపయోగించి పూజ చేయటం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని పూజ చేసిన వ్యర్థమేనని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.మరి పరమేశ్వరుడికి ఏ వస్తువులతో పూజ చేయకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement
The Things You Should Not Offer To Maha Shiva During Pooja, Lord Shiva, Shravan

సాధారణంగా ఏ దేవదేవతకైనా పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమను తప్పనిసరిగా ఉపయోగిస్తాము.కానీ ఆ బోలా శంకరుడికి పూజ సమయంలో పసుపు కుంకుమలను ఎలాంటి పరిస్థితులలో కూడా వాడకూడదని పండితులు చెబుతున్నారు.

స్వామివారు త్రినేత్రుడు కనుక స్వామివారి మూడవకన్ను అడ్డుగా కుంకుమ పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.అదేవిధంగా శివలింగం అనేది పురుషతత్వానికి ప్రతీక.

పసుపు అనేది కేవలం స్త్రీలకు సంబంధించినది.అందుకోసమే పరమేశ్వరుడి పూజలో పసుపును ఉపయోగించరు.

The Things You Should Not Offer To Maha Shiva During Pooja, Lord Shiva, Shravan

అదేవిధంగా పరమేశ్వరుడికి కొబ్బరినీళ్ళను నిషేధించారు.స్వామివారికి సమర్పించేవి ఎంతో స్వచ్ఛంగా ఉండాలి.కొబ్బరి నీళ్లను స్వామివారికి సమర్పించిన తర్వాత మనం తాగుతాము కనుక కొబ్బరి నీళ్లను శివుడి కి సమర్పించకూడదని చెబుతారు.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?

పురాణాల ప్రకారం శంఖచుడు అనే రాక్షసుడు శివుడు చేతిలో మరణించాడు అందుకోసమే శంఖంలో పోసిన నీటితో స్వామివారికి అభిషేకం నిర్వహించకూడదు.అదేవిధంగా తులసి ఆకులను ఎలాంటి పరిస్థితులలో కూడా పరమేశ్వరుడి పూజకు ఉపయోగించరు.

Advertisement

కేవలం బిల్వ దళాలను మాత్రమే పరమేశ్వరుడికి సమర్పించాలి.అదేవిధంగా ఎర్రటి పుష్పాలతో పరమేశ్వరుడికి పూజ చేయకూడదు.

ఇలాంటి వస్తువులతో స్వామివారికి పూజ చేసిన ఆ పూజకు ఎలాంటి ఫలితం ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు