ప్ర‌పంచంలోనే అత్యంత వృద్ధ క‌వ‌ల‌లు వీరు.. గిన్నీస్ రికార్డు బ‌ద్ద‌లు

ఈ సృష్టిలో మాన‌వుని జీవితం కాలం ఒక‌ప్పుడు బాగా ఉండేది.కానీ ఇప్పుడు చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది.

ఇప్పుడున్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి మ‌హా అయితే 70 లేదంటే 80 అన్న‌ట్టు గానే జీవిత ప్ర‌మాణాన్ని అంచ‌నా వేయొచ్చు.కాగా కొంద‌రు మాత్రం ఏకంగా వందేండ్ల‌కు పైబ‌డి జీవిస్తున్న వారు కూడా ఉన్నారు.

ఇలాంటి వారు చాలా అరుదుగా జీవిస్తుంటారు.ఇక‌పోతే ఒక వ్య‌క్తి జీవిస్తే అది రికార్డు అయితే ఇద్ద‌రు క‌వ‌ల‌లు కూడా ఇలాంటి విష‌యాల్లో తాజాగా రికార్డు సృష్టించారు.

ఈ భూమ్మీద అత్యంత వృద్ధ క‌వ‌లలుగా వారు నిలిచారు.ఈ ఇద్ద‌రికీ దాదాపుగా 107 వ‌య‌స్సు ఉంటుంది.

Advertisement

దీంతో వీరిద్ద‌రూ కూడా ఇప్పుడు గిన్నిస్‌ రికార్డు సృష్టించారు.ఉమెనో సుమియామ, కౌమె కొడమ అనే ఇద్ద‌రు అక్కా చెల్లెల్లు ఇప్పుడు వార్త‌ల్లో నిలిచారు.

ఇక్క‌డ మ‌రో ట్విస్టు ఏంటంటే వీరిద్ద‌రూ చిన్న‌ప్పుడే విడిపోయారంట‌.కానీ మ‌ళ్లీ 70 ఏండ్ల వ‌య‌స్సులో క‌లిశారంట‌.

వీరిద్ద‌రూ క‌లిసి ఇంత‌కు ముందు జపాన్ దేశానికి చెందిన కిన్‌ నరిటా, జిన్‌ కానీ క‌వ‌ల‌లు నెల‌కొల్పిన రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు.వారికంటే వీరు 225 రోజులు ఎక్కువ‌గా బ్ర‌తికి ఈ రికార్డు సొంతం చేసుకున్నారు.

70 ఏండ్ల త‌ర్వాత క‌లుసుకున్న వీరిద్ద‌రూ కూడా చాలా వ‌ర‌కు ఆలయాలను సందర్శించుకుని, ఎన్నో యాత్ర‌లు చేస్తున్నారంట‌.వీరిద్ద‌రికీ ఉన్ హాస్యచతురత, పెద్దరికం కార‌ణంగా వీరు 1990వ సంవ‌త్సరం నుంచే ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద సెల‌బ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్నారంటే వీరి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.ఇప్పుడు వీరు ఆరోగ్య ప‌రిస్థితుల కార‌ణంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
కారు బానెట్‌పై చిన్నారి కూర్చోబెట్టి రోడ్డుపై ఏకంగా..? (వీడియో)

వీరిద్ద‌రూ కూడా జ‌పాన్‌కు చెందిన వారే కావ‌డం విశేషం.ఇక జ‌పాన్‌లో ఇప్పుడు దాదాపు 29శాతం జ‌నాభా 60ఏండ్ల పైబ‌డిన వారేన‌ని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు