ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఐపీఎల్( IPL ) ఫీవర్ నడుస్తుంది.ఇక అందులో భాగంగానే ప్రతి టీమ్ కూడా తనదైన రీతిలో మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి.
ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో మయాంక్ యాదవ్( Mayank Yadav ) అద్భుతమైన బౌలింగ్ చేసి తనదైన రీతిలో మూడు వికెట్లు తీయడమే కాకుండా, లక్నో టీమ్( Lucknow Team ) విజయంలో కూడా కీలకపాత్ర వహించాడు.ఇక ఆయన తీసిన వికెట్లు కూడా ఆ టీం కి చాలా బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.
ఇక ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో కూడా మయాంక్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం విశేషం… వరుసగా రెండు మ్యాచ్ ల్లో తన సత్తా చాటి లక్నో టీమ్.కి రెండు విజయాలను అందించాడు.ఇక ఇప్పటి వరకు ఆయన ఆడిన 2 మ్యాచుల్లో 6 వికెట్లు తీశాడు…

ఇక ఇది ఇలా ఉంటే ఢిల్లీ టీమ్ కి చెందిన కలీల్ అహ్మద్( Khaleel Ahmed ) సూపర్ గా బౌలింగ్ చేస్తూ రీసెంట్ గా చెన్నై మీద జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన స్పెల్ వేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లకు చుక్కలు చూపిస్తున్నాడనే చెప్పాలి.ఇక ఇలాంటి క్రమంలోనే చెన్నై మీద ఢిల్లీ ( Delhi ) మ్యాచ్ గెలవడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించాడు.ఇక ముందు జరగబోయే మ్యాచ్ ల్లో కూడా తను తన విశ్వరూపం చూపించి మంచి విజయాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పటి వరకు ఈయన 3 మ్యాచ్ లు ఆడితే అందులో 5 వికెట్లు తీశాడు…

ఇక ప్రస్తుతం ఇండియన్ టీం లో( Indian Team ) ఉన్న ప్లేయర్లు అందరూ చాలా మంచి బౌలింగ్ చేస్తూ ఇండియన్ టీమ్ కి ఫ్యూచర్ లో బౌలర్లుగా తమదైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.ఇక ఇలాంటి క్రమం లోనే ఇండియన్ టీమ్ లో ఈ బౌలర్లు బౌలింగ్ విభాగాన్ని చాలా స్ట్రాంగ్ గా తయారు చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇప్పటివరకు బ్యాటింగ్ లోనే స్ట్రాంగ్ గా ఉన్న ఇండియన్ టీం ఇక మొదట బౌలింగ్ లో కూడా మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి…
.