ప్రపంచంలోనే వారు పెట్టుకొనేదే బెస్ట్ ముద్దు... అంతకన్నా ఘాటైన ముద్దు మరొకటి లేదట?

ఛీ.ముద్దు పెట్టుకోవడం కూడా ఒక వార్తేనా అని అనుకుంటున్నారా? అన్నన్నా.అలా అస్సలు అనుకోవడానికి లేదు.

ఎందుకంటే దానిమీద కూడా రికార్డులు ఉంటాయి మరి.ఈ ప్రపంచంలో ఏదైనా కొత్తది లేదా వింతగా కనిపించినా గుర్తించి రికార్డులు ఇచ్చేవారు వుంటారు మరి.అందుకే ఇలాంటి రికార్డుల కోసం రకరకాల సాహసాలు చేస్తూ ఉంటారు ఔత్సాహికులు.ఒకరు సాధించిన రికార్డును మరొకరు బద్దలు కొడుతూ తెగ సంబర పడుతూ వుంటారు.

మరి ముద్దుల పోటీ అంటే మన శృంగార ప్రియులు ఊరుకుంటారా? అవును, తాజాగా ఓ జంట ఘాటైన ముద్దు పెట్టుకుని ఈ గిన్నీస్ రికార్డుల్లో నిలిచింది.

కెనడాకు చెందిన మైక్, జామీ జాక్ ( Mike, Jamie Jack )దంపతులు ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్( Guinness Book of World ) రికార్డును సాధించినట్టు తెలుస్తోంది.వీరిద్దరు ఏకధాటిగా 15 నిమిషాల 6.5 సెకన్ల పాటు లిప్‌లాక్ చేసుకున్నారు మరి.అయితే ఇంతకంటే ఎక్కువ సమయం ముద్దు పెట్టుకున్నవారు ఇప్పటికే గిన్నీస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? అయితే మైక్, జామీ జాక్ ముద్దు వెనక మరో ఘాటైన ట్విస్ట్ ఉంది.విషయం ఏమంటే ప్రపంచంలోనే అత్యంత ఘాటైన, కారమైన మిరపకాయను వారు లిప్‌లాక్‌కు ముందు తిన్నారు.ఆ తర్వాత వారు ఈ 15 నిమిషాల 6.5 సెకన్ల పాటు ముద్దు పెట్టుకోవడం ఈ గిన్నీస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడానికి కారణం అయింది.

Advertisement

కాగా ఆ మిరపకాయ పేరు హెబనెరో పెప్పర్‌( Hebanero Pepper ).ఇంత ఘాటు, కారమైన హెబనెరో పెప్పర్ ను తిన్న తర్వాత 15 నిమిషాలకు పైగా లిప్‌లాక్ చేసుకోవడం అంటే సాధారణమైన విషయం కాదని నిపుణులు అంటున్నారండోయ్.అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం మరొకటి వుంది.

మైక్, జామీ జాక్ జంట త్వరలోనే తమ 15వ మ్యారేజ్ డేను జరుపుకోనున్నారు.ఈ 15 వ వివాహ వార్షికోత్సవాన్ని చిరకాలం గుర్తుంచుకునే విధంగా ఉండేందుకే ఈ ఘాటైన ముద్దు పెట్టుకున్నట్లు గిన్నీస్ బుక్‌లో పేరు సంపాదించుకున్న తర్వాత ఆ జంట వెల్లడించడం కొసమెరుపు.

అయితే ప్రపంచంలోనే ఘాటైన పెప్పర్లు తిన్న రికార్డులు ఇప్పటికే మైక్‌ పేరిట ఉండటం గమనార్హం.అయితే ఇలాంటి రికార్డుల్లో తన సతీమణి జామీ జాక్‌ పేరును కూడా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ ఘాటైన లిప్‌లాక్ చేసినట్లు వివరించారు.

వీడియో: ఇది ఎక్కడ బౌలింగ్ రా బాబు.. ఇట్లా చేతులు తిప్పుతున్నాడేంటి..
Advertisement
" autoplay>

తాజా వార్తలు