టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.సీఎం జగన్ పై కావాలనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు విషం చిమ్ముతున్నారన్నారు.
కానుకల పేరుతో పేదల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు.ఇటీవల చోటు చేసుకున్న రెండు దుర్ఘటనలకు కారణం చంద్రబాబేనని మండిపడ్డారు.
ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే జనమే చంద్రబాబుని బాదుడే బాదుడు అంటారని తెలిపారు.అనంతరం లోకేష్ పాదయాత్ర వలన టీడీపీకే నష్టమని చెప్పారు.
లోకేష్ పాదయాత్రను ఆపాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.







