మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో 150కు పైగా సినిమాలలో నటించారు.ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు విజయాన్ని అందుకున్నాయి.
తెరపై హీరో హీరోయిన్లు ఎలా ప్రవర్తించినా అభిమానులకు నచ్చుతారు.అయితే తెరపై సంతోషంగా కనిపించే హీరో హీరోయిన్లు రియల్ లైఫ్ లో గొడవ పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.తనతో నటించే హీరోయిన్లకు తగిన గౌరవం ఇవ్వడంతో పాటు ఫ్రెండ్లీగా ఉండటం చిరంజీవికి అలవాటు.
40 సంవత్సరాల సినీ కెరీర్ లో చిరంజీవి ఏకంగా మూడు తరాల కథానాయికలతో చిరంజీవి నటించారు.కొంతమంది హీరోయిన్లతో చిరంజీవి పదికి పైగా సినిమాలలో నటించడం గమనార్హం.వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవితో ఇద్దరు హీరోయిన్లు మాత్రం పరోక్షంగా గొడవ పడి గతంలో వార్తల్లో నిలిచారు.
కెరీర్ తొలినాళ్లలో చిరంజీవితో కలిసి నటించిన మాధవి మరో హీరోయిన్ నగ్మా చిరంజీవిని ఇబ్బంది పెట్టిన హీరోయిన్లుగా వార్తల్లో నిలిచారు.
చిరంజీవి తొలి సినిమా అయిన ప్రాణం ఖరీదు సినిమాలో మాధవి అతిథి పాత్రలో నటించారు.

ఆ తర్వాత కూడా చిరంజీవి, మాధవి పలు సినిమాల్లో కలిసి నటించినా ఇద్దరి మధ్య మాటలు ఉండేవి కావని సమాచారం.అయితే తర్వాత కాలంలో మాత్రం మాధవి చిరంజీవితో స్నేహపూర్వకంగా మెలిగారు.చిరంజీవికి జోడీగా మూడు సినిమాలలో నగ్మా నటించారు.ఈ మూడు సినిమాలలో ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

చిరంజీవి నగ్మా కలిసి నటించిన రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.చిరంజీవితో ముగ్గురు మొనగాళ్లు సినిమాలో నటించే సమయంలో నగ్మా చివరి షెడ్యూల్ లో ఇబ్బంది పెట్టారని కొన్ని సీన్లను డూప్ తో తీశారని సమాచారం.రిక్షావోడు సినిమా పాటల షూటింగ్ సమయంలో నగ్మా సహకరించక ఇబ్బంది పెట్టారని సమాచారం.ఆ తర్వాత చిరంజీవి, నగ్మా కలిసి నటించలేదు.