టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ హీరోయిన్లలో సాయిపల్లవి( Sai Pallavi ) ముందువరసలో ఉంటారు.తక్కువ సినిమాలే చేసినా సాయిపల్లవి చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
తండేల్ సినిమాతో( Thandel ) సాయిపల్లవి ఈ ఏడాది మరోమారు అదృష్టాన్ని పరీక్షించోనున్నారు.నాగచైతన్య, సాయిపల్లవి కాంబో హిట్ కాంబో కావడంతో ఈ కాంబినేసన్ లో ఎక్కువ సినిమాలు తీయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే సాయిపల్లవికి ఏ సమస్య వచ్చినా సపోర్ట్ చేసే విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రానా,( Rana ) నాగచైతన్య,( Naga Chaitanya ) శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) ముందువరసలో ఉంటారని తెలుస్తోంది.ఈ ముగ్గురితో సాయిపల్లవికి మంచి స్నేహ బంధం ఉందని సమాచారం అందుతోంది.
శేఖర్ కమ్ముల సినిమాల ద్వారా తెలుగులో సాయిపల్లవి ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.
ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు సాయిపల్లవి సినీ కెరీర్ లో బెస్ట్ సినిమాలు అని చెప్పవచ్చు.సాయిపల్లవి ఇతర ఇండస్ట్రీలపై ఫోకస్ పెడితే అక్కడ కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.సాయిపల్లవి రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఇతర హీరోయిన్లతో పోలిస్తే తక్కువగానే ఆమె పారితోషికం ఉంది.
సాయిపల్లవి యాడ్స్ కు కూడా దూరంగా ఉన్నారు.సినిమాలలో ఆఫర్లు తగ్గిన తర్వాత సాయిపల్లవి డాక్టర్ గా కెరీర్ ను కొనసాగించాలని భావిస్తుండటం గమనార్హం.సాయిపల్లవి ఆస్తులు కూడా తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.
సాయిపల్లవి తమిళంలో పలు సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు.సాయిపల్లవి రాబోయే రోజుల్లో అయినా సినిమాల విషయంలో వేగం పెంచుతారేమో చూడాల్సి ఉంది.
సాయిపల్లవి డ్యాన్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.భారీ, క్రేజీ ప్రాజెక్ట్ లతో సాయిపల్లవి ప్రేక్షకుల ముందుకు వస్తే ఆమె ఖాతాలో మరిన్ని విజయాలు చేరతాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.