ఇంతకీ ఆ ముంబై భామలు తెలుగు సినిమాలు చేస్తారా?

తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే.ఇక్కడి నటీమణులను కాదని ముంబై భామలపై ఆధారపడటం.

బాలీవుడ్ లో కాస్త పేరు సంపాదిస్తే చాలా ఆ హీరోయిన్లను టాలీవుడ్ లో దించాలనుకుంటారు ఇక్కడి ఫిల్మ్ మేకర్స్.అలా దీపికా పదుకునే, జాన్వీ కపూర్, సోనాక్షి సిన్హా, అలియా భట్ సహా పలువురు హాట్ బ్యూటీలను ఇక్కడికి తీసుకురావాలి అనుకున్నారు దర్శకులు.

అయితే వారి ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

దీపికా పదుకొనె

ఈ పొడుగు కాళ్ల సుందరిని తెగులు తెరకు పరిచయం చేయాలని దర్శక నిర్మాతలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడీ కడుతుందని చాలా సార్లు వార్తలు వచ్చాయి.శ్రీమంతుడు కోసం దీపికను సెట్ చేయడానికి ప్రయత్నించినా సక్సెస్ కాలేదు దర్శకుడు.

Advertisement

మహర్షితోనైనా జతకడుతుందనుకున్నా సాధ్యం కాలేదు.ప్రభాస్ కూడా దీపిక కోసం చాలా ట్రై చేశాడు.

సాహోలో ఆమే హీరోయిన్ అనుకున్నారు.కానీ చివరకు శ్రద్ధా కపూర్ ఆ ఛాన్స్ కొట్టేసింది.

సోనాక్షి సిన్హా

ఈ బొద్దుగుమ్మ సైతం చాలా కాలంగా తెరలో దర్శనం ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.కానీ ఇంకా సాధ్యం కాలేదు.చిరంజీవి 150 వ సినిమా కోసం ఈమెను ఓకే చేయాలనుకున్నా కుదరలేదు.

నాగార్జున కోసం కూడా ఆమెను సెట్ చేయాలనుకున్నారు.అదికూడా సక్సెస్ కాలేదు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

అయితే తెలుగులో సినిమాలు చేసేందుకు ఆమె ఇంట్రెస్ట్ గా లేదని తెలుస్తోంది.

జాన్వీ కపూర్

Advertisement

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా తొలి సినిమా తెలుగులోనే చేస్తుందని అందరూ అనుకున్నారు.కానీ అది సాధ్యం కాలేదు.అక్కినేని అఖిల్ తో జాన్వీ తెరంగేట్రం ఉంటుందనుకున్నారు.

అది కూడా నిజం కాలేదు.నాగ చైతన్యతో జాన్వి ఓ సినిమా చేస్తున్నట్లు గాసిప్స్ వచ్చినా నిజం కాలేదు.

తన కుమారులతో సినిమాలు చేసేందుకు నాగార్జున ప్రయత్నించినా ఓకే కాలేదనే వార్తలు గతంలో హల్ చల్ చేశాయి. శ్రీదేవి బతికుండాగానే జాన్వీని తెలుగులో పరిచయం చేయాలనే ఆలోచన అప్పట్లో ఉండేదట.

జగదేకవీరుడు - అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్ చేయాలనుకున్నారు.ఆ సినిమాలో చిరంజీవి - శ్రీదేవి ఓ జంట, రాంచరణ్ - జాన్వీ కపూర్ మరో జంటగా ఇందులో నటించాలి అనుకున్నారు.

కానీ అది వర్కౌట్ కాలేదు.పలువురు బాలీవుడ్ బ్యూటీలు తెలుగులోకి వస్తారని ప్రచారం జరిగినా.

ఇప్పటి వరకు సాధ్యం కాకపోవడం విశేషం.

తాజా వార్తలు