మీ పిల్లలు మరీ పొట్టిగా ఉన్నారా.. ఎత్తు పెర‌గ‌ట్లేదా.. అయితే ఇలా చేయండి!

సాధారణంగా కొందరు పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు ఉండరు.చాలా పొట్టిగా కనిపిస్తారు.

దీంతో తల్లిదండ్రులు తెగ హైరానా పడుతుంటారు.పిల్లల హైట్ విషయంలో వైద్యులను సైతం సంప్రదిస్తుంటారు.

డాక్టర్లు ఏవో ప్రోటీన్ పౌడర్ మరియు మందులు రాసిస్తుంటారు.హైట్ పెరగాలంటే చిన్నవయసులోనే జాగ్రత్త తీసుకోవాలి.15 ఏళ్ల తర్వాత ప్రయత్నించినా పెరగరు.అయితే ఎత్తును పెంచడానికి కొన్ని కొన్ని ఆహారాలు చాలా ఉత్తమంగా సహాయపడతాయి.

ఆ ఫుడ్స్ ను మీ పిల్లల డైట్ లో చేర్చితే వారి హైట్ విషయంలో కచ్చితంగా మార్పులను గమనిస్తారు.మరి ఇంకెందుకు ఆలస్యం పిల్లల ఎత్తును పెంచే ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

గుడ్డు‌‌.( Eggs ).పోషకాల గని ఇది. విటమిన్ డి కూడా గుడ్డులో ఉంటుంది.అందువల్ల పిల్లల చేత ప్రతిరోజు ఒక ఉడికించిన గుడ్డును తినిపించాలి.

తద్వారా గుడ్డులో ఉండే పోషకాలు వయసుకు తగ్గట్లుగా పిల్లల బరువును మరియు ఎత్తును పెంచడానికి సహాయపడతాయి.అలాగే బాదం పప్పు సైతం పిల్లల హైట్ ను పెంచడానికి హెల్ప్ చేస్తాయి.

ప్రతిరోజు నాలుగు లేదా ఐదు నానబెట్టిన బాదం పప్పులు పిల్లలకు ఇవ్వాలి.బాదం లో ఉండే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, హెల్తీ ఫ్యాట్స్ పిల్లల హైట్ తో పాటు మానసిక ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.

పిల్లల రెగ్యులర్ డైట్ లో పాలు ( Milk )పెరుగు ఉండేలా చూసుకోవాలి.ఇవి పిల్లల ఎదుగుదలలో కీలక పాత్రను పోషిస్తాయి, ఎముకలు కండరాల దృఢత్వానికి సహాయపడతాయి, చిలగడదుంప.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

చూపుకు ఇంపుగా తినడానికి రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలను సైతం కలిగి ఉంటుంది.మీ పిల్లలు మరీ పొట్టిగా ఉంటే కనుక కచ్చితంగా వారి డైట్ లో చిలగడదుంపను చేర్చాల్సిందే.

Advertisement

రోజుకు ఒక ఉడికించిన చిలగడదుంప( Sweet potato )ని పిల్లలకు ఇస్తే వాళ్ళు చక్కగా హైట్ పెరుగుతారు.అలాగే ఆకుకూరలు, నట్స్, కినోవా, చికెన్, క్యారెట్, బీన్స్, అరటి పండ్లు, దానిమ్మ, చేపలు వంటి ఆహారాలను కూడా పిల్లల డైట్ లో ఉండేలా చూసుకోవాలి.ఈ ఆహారాలు పిల్లల ఎత్తును అద్భుతంగా పెంచుతాయి.

అదే సమయంలో వారి ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.

తాజా వార్తలు