ఈ ఆహారాలు డైట్‌లో చేర్చుకుంటే జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు!

ఇటీవ‌ల కాలంలో జుట్టు రాలే స‌మ‌స్య‌ను చాలా మంది ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా యువ‌తీయువ‌కులు కూడా ఈ స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే వారు తెలియ‌కుండా టెన్ష‌న్ ప‌డి.డిప్రెష‌న్‌కు లోన‌వుతున్నారు.

ఇక జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి.అయితే డైలీ డైట్‌లో కొన్ని ఆహార ప‌దార్థాలు చేర్చుకుంటే.

జుట్టు రాలే స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.ముందుగా గుడ్డు జుట్టు ఆరోగ్యంగా చేయ‌డంలోనూ, జుట్టు రాలే స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలోనూ అద్భుత్భంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement

ఎందుకంటే.జుట్టుకు అవసరమయ్యే ప్రోటీన్ మరియు పోషకాలు గుడ్డులో పుష్క‌లంగా ఉంటాయి.

అందుకే ప్ర‌తిరోజు ఒక గుడ్డును తీసుకోవాలి.అలాగే పాలకూరలో ఉండే ఐరన్, ఫోలేట్ ఇత‌ర పోష‌కాలు జుట్టు రాలే స‌మ‌స్య‌ను త‌గ్గిస్తాయి.

కాబ‌ట్టి, పాల‌కూర‌ను వారంలో రెండు సార్లు తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.ప్రోటీన్లు, విటమిన్-ఎ, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా ఉండే చేప‌లను కూడా డైట్‌లో చేర్చుకుంటే జుట్టు రాలే స‌మ‌స్య త‌గ్గి.ఒత్తుగా, ఆరోగ్యం పెరుగుతుంది.

అలాగే వాల్ నట్స్, బాదం, మెంతులు, పాలు, బత్తాయి, నారింజ పండ్లు, నేరేడు, క్యారెట్‌ వంటివి కూడా తీసుకుంటే జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు.

అక్కినేని కొత్త కోడలికి ఇష్టమైన వంటకం ఇదే.. ఆ ఆయిల్ ఫుడ్ ఎంతో ఇష్టంగా తింటారా?
Advertisement

తాజా వార్తలు