ఇర్రెగ్యులర్ పీరియడ్స్.చాలా మంది ఆడవాళ్లు ఫేస్ చేస్తున్న సమస్య ఇది.
నెలసరి సమయం కంటే ముందే రావడం లేదా సమయం దాటిపోయినా రాకపోవడమే ఇర్రెగ్యులర్ పీరియడ్స్.ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.
హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, పౌష్టికాహారం లోపం ఇలా రకరకాల సమస్యల వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎదురవుతుంది.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలి అని భావించే వారు.
ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకోబోయే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి.మరి ఆలస్యం చేయకుండా ఆ ఆహారాలు ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.

ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ను నివారించడంలో నువ్వులు గ్రేట్‌గా సహాయపడతాయి.నువ్వులను డైలీ తగిన మోతాదులో తీసుకుంటే గనుక.అందులో ఉండే కొన్ని పోషకాలు హార్మోన్లను ఉత్పత్తి చేయడంతో పాటు హీర్మోన్లను బ్యాలెన్స్ చేసి.పీరియడ్స్‌ను సరైన సమయంలో వచ్చేలా చేస్తాయి.అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఉన్న వారు పచ్చి బొప్పాయిని ప్రతి రోజు తీసుకోవాలి.ఫలితంగా, పచ్చ బొప్పాయిలో ఉండే పలు కాంపౌడ్స్ యూట్రస్‌కు రక్త ప్రసరణను మెరుగ్గా అందించి.
ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ను దూరం చేస్తుంది.
నీరు తక్కువగా తాగడం వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఏర్పడుతుంది.
కాబట్టి, ప్రతి రోజు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల.అందులో ఉండే ప్రోటీన్స్ మరియు మినరల్స్ పీరియడ్స్‌ను రెగ్యులర్‌గా వచ్చేందుకు సహాయపడతాయి.
కొత్తిమీరను కూడా రెగ్యులర్‌గా ఏదో ఒక రూపంలో తీసుకుంటే.
హార్మోన్ల ఉత్పత్తి చేయడంతో పాటు రక్త హీనత సమస్యను కూడా తగ్గుతుంది.ఫలితంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య దూరం అవుతుంది.
అలాగే ప్రతి రోజు ఉదయం కలబంద జ్యూస్ తీసుకుంటే.ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య తగ్గడమే కాదు అధిక బరువు కూడా అదుపులోకి వస్తుంది.