జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా జబర్దస్త్ కమెడియన్లు.. ప్రచారంలో బిజీ బిజీ?

ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అందరి ఆసక్తి ఈ ఎన్నికలపైనే ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) జనసేన ( Janasena ) పార్టీ స్థాపించి తన పార్టీని టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి రెండు పార్లమెంటు స్థానాలు 21 అసెంబ్లీ స్థానాలను కూడా కేటాయించారు అయితే జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడిన ప్రతి చోటా గెలిచే విధంగానే వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఎంతోమంది సిరి సెలెబ్రిటీలు కూడా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.పవన్ కళ్యాణ్ పిలవాలే కానీ తాము ప్రచారానికి వస్తాము అంటూ పలు సందర్భాలలో వెల్లడించారు .ఇక పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానులుగా ఉన్నటువంటి కొందరు జబర్దస్త్ కమెడియన్స్ ను జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా ( Star Campaigner )  నియమించినట్టు తెలుస్తుంది.వీరందరూ కూడా జనసేన పార్టీ తరఫున పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

మరి జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా ఎవరెవరిని నియమించారు అనే విషయానికి వస్తే.పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, జబర్దస్త్ హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆర్కే నాయుడు అలియాస్ సాగర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి,స్టార్ క్యాంపెనర్లుగా వ్యవహరిస్తారని జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ పేరుతో ఒక లేఖ విడుదల చేశారు.ఇలా వీరందరూ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

ఇక త్వరలోనే వీరందరూ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీబిజీగా మారబోతున్నారు.

Advertisement
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

తాజా వార్తలు