ఉండి తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది.ఇక్కడి నుంచి టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజు( MLA Sivaramaraju ) ను టిడిపి తమ అభ్యర్థిగా ప్రకటించింది.
టిడిపి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ( Former MLA Vetukuri Venkata Sivaramaraj )కు టికెట్ ను నిరాకరించడం తో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
అయితే ఉండి టిడిపి అభ్యర్థిగా నరసాపురం ఎంపీ రఘురామకష్ణంరాజును ప్రకటించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారనే వార్తలతో టిడిపి క్యాడర్ లో గందరగోళం నెలకొంది.ఇటీవల పాలకొల్లు లో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభలోనే రఘురామ కృష్ణంరాజు టిడిపి కండువా కప్పుకున్నారు.ఆయనకు ఉండి టికెట్ ఇవ్వబోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం అప్పటి నుంచి జరుగుతుంది.
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు ను పోటీ నుంచి తప్పుకునేలా ఒప్పించేందుకు చంద్రబాబు( Chandrababu ) మంతనాలు జరుపుతున్నారు.అయితే రామరాజు పోటీ నుంచి తప్పుకుంటారా లేక రెబల్ గా పోటీ చేస్తారా అనేది క్లారిటీ లేదు .ప్రస్తుతం రామరాజు టిడిపి అభ్యర్థిగానే విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.గతంలో అండి నుంచి వేటుకూరి వెంకట శివరామరాజు టిడిపి అభ్యర్థిగా రెండుసార్లు పోటీ చేసి విజయం సాధించారు.
గత ఎన్నికల్లో రఘురామ కృష్ణంరాజు( Raghurama Krishna Raju ) చివరి నిమిషంలో టిడిపికి రాజీనామా చేసి, వైసీపీలో చేరడంతో , నరసాపురం టిడిపి ఎంపి అభ్యర్థిగా శివరామరాజును ను పోటీకి దించారు.దీంతో శివరామరాజు ఉండి అభ్యర్థిగా తన మిత్రుడైన రామరాజును సిఫార్సు చేయడంతో, ఆయనకే టికెట్ ఇచ్చారు.
అయితే ఆ ఎన్నికల్లో శివరామరాజు ఓటమి చెందగా, ఉండిలో రామరాజు విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, ఆ సీటు నుంచి తప్పుకోవాల్సిందిగా రామరాజును శివరామరాజు కోరగా, ఆయన నిరాకరించడంతో రెబల్ గా పోటీ చేస్తున్నారు.అయితే ఇప్పుడు రఘురామ కృష్ణంరాజును టిడిపి అభ్యర్థిగా ప్రకటిస్తే రామరాజు ఎంతవరకు ఆయనకు మద్దతు ఇస్తారు అనేది తేలాల్సి ఉంది. ఒకవైపు రామరాజు , మరోవైపు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, రఘురాం కృష్ణంరాజు ముగ్గురు ఎన్నికల్లో పోటీ చేస్తే వైసిపి అభ్యర్థి పివిఎల్ నరసింహారాజు గెలుపు నల్లేరు మీద నడక అయినట్టే.