తమ వైవాహిక జీవితాన్ని సమస్యలలో పడేసుకునే రాశులు ఇవే..!

మన భారత దేశంలో వివాహ జీవితం అనేది ఎంతో పవిత్రమైన బంధం.

ఎందుకంటే చివరి వరకు ఒకరిని ఒకరు కలిసి ఉండాలని ఇద్దరు వ్యక్తులకు వివాహ బంధంతో ముడిపెడతారు.

భార్యాభర్తలు ఒకరికొకరు లోబడి గౌరవించుకుంటూ, నమ్మకంగా, బాధ్యతగా కలిసి మెలిసి ఉండాలి.భాగస్వాముల మధ్య తప్పనిసరిగా రాజీపడే మనసత్వం, క్షమించే గుణం కచ్చితంగా ఉండాలి.

అప్పుడే దంపతులు తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు.కొంతమంది మాత్రం తెలివి తక్కువ తనం, అహంకారంతో తమ జీవితాన్ని తమే నాశనం చేసుకుంటూ ఉంటారు.

ఆవేశంలో ఆలోచన లేకుండా తీసుకునే కొన్ని నిర్ణయాలు రెండు జీవితాలని నాశనం చేస్తాయి.ఉద్రేకం వారి వివాహ బంధాన్ని నాశనం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఈ రాశుల వారి మనసుల ప్రకారం వారి వైవాహిక జీవితం ప్రమాదంలో పడే లక్షణాలు ఉన్నాయి.మరి ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ధనస్సు రాశి( Dhanusu Rashi ) వారు ఎదుటివారి అవసరాలు గమనించి అందుకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది.సరైన గౌరవం ఇవ్వకపోతే అది ఇద్దరి మధ్య అపార్ధాలకు దారితీస్తుంది.

ఇటువంటి సమస్యని ఎదుర్కోవడం సవాలుగా మారుతుంది.ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ రాజీపడితే ఈ రాశి వాళ్ళు ఉత్తమ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.అలాగే వృశ్చిక రాశి ( Scorpio )వారు తీవ్రమైన ఒత్తిడిని కలిగి ఉంటారు.

దీన్ని అదుపులో ఉంచుకుంటే భాగస్వామితో సంతోషంగా గడపవచ్చు.భార్యాభర్తలు నమ్మకంగా మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఓపెన్ గా మాట్లాడుకుంటే బలమైన బంధాన్ని ఏర్పరుచుకోవచ్చు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

అలాగే సింహ రాశి వారు గుర్తింపుని బలంగా కోరుకుంటారు.

Advertisement

ఇదే గుర్తింపు భాగస్వామి దగ్గర నుంచి కూడా కోరుకుంటూ ఉంటారు.భాగస్వామి అవసరాలు పరిగణలోకి తీసుకోకపోతే ఇద్దరి మధ్య వివాహ వివాదాలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే వృషభ రాశి(Taurus ) వారిలో మొండితనం ఎక్కువగా ఉంటుంది.

ఇతరులు చెప్పే సలహాలు పాటించేందుకు వీరు అస్సలు ఆసక్తి చూపించరు.ఇటువంటి ప్రవర్తన వివాహ బంధాన్ని ఇబ్బందుల్లో పడేస్తుంది.

ఓపెన్ మైండ్ తో భాగస్వామితో కూర్చొని మాట్లాడుకుని తమ మనసులోని విషయం అర్థమయ్యేలా చెప్పి ఒప్పించగలిగితే వారి జీవితం ఆనందంగా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే మేషరాశి వారు ఎక్కువగా, స్వచ్ఛంగా కోరుకుంటున్నారు.

భాగస్వామి తమ స్వేచ్ఛకు అడ్డు చెప్తున్నాడని భావన కలిగి వారితో గొడవలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇది వివాహంలో విభేదాలకు దారితీస్తుంది.

ఏ విషయం అయినా చేసుకుని ఇద్దరు రాజీపడి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే తమ బంధం వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

తాజా వార్తలు