దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 కార్లు ఇవే

ఈ సంవత్సరం భారతదేశంలోని కార్ల తయారీదారులు ఆనందంలో ఉన్నారు.ఆటోమోటివ్ పరిశ్రమ( Automotive industry ) సంవత్సరానికి 29 శాతానికి పైగా విక్రయాల వృద్ధిని నమోదు చేసింది.2023లో మారుతీ సుజుకీ( Maruti Suzuki ) 41.73 శాతం మార్కెట్ వాటాతో తన ప్రస్థానాన్ని నిలుపుకుంది.ఆ తర్వాత వరుసగా 14.27 శాతం, 13.45 శాతం మరియు 9.60 శాతం మార్కెట్ వాటాతో హ్యుందాయ్, టాటా, మహీంద్రా ఉన్నాయి.దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల గురించి తెలుసుకుందాం.

 These Are The Top 10 Best Selling Cars In The Country, Top 10 Cars, Selling, Lat-TeluguStop.com

ఇందులో మారుతీ సుజుకి నుండి 7 మోడల్‌లు, టాటా( Tata ) నుండి 2, హ్యుందాయ్ నుండి 1 మోడల్ ఉన్నాయి.మారుతి ఆల్టో జూలై నెలలో మొత్తం 21,260 యూనిట్ల అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.హ్యాచ్‌బ్యాక్ జులై 2022లో 17,389 యూనిట్లను విక్రయించి, ప్రస్తుతం 22 శాతం వృద్ధిని నమోదు చేసింది.ఇటీవల, కంపెనీ ఆల్టో కె10 ధర రూ.3.99 లక్షల నుండి రూ.5.33 లక్షల (ఎక్స్-షోరూమ్)లో విడుదల చేసింది.

మారుతి వ్యాగన్ఆర్( Maruti WagonR ) 17,945, మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ ( Maruti Swift hatchback )17,231 విక్రయాలతో కార్ల తయారీ సంస్థకు మంచి నంబర్‌లను సాధించడం కొనసాగించాయి.మారుతి వ్యాగన్ఆర్ వార్షిక అమ్మకాలు 45 శాతం వృద్ధిని నమోదు చేయగా, మారుతి స్విఫ్ట్ 88 శాతం వృద్ధిని సాధించింది.మారుతీ సుజుకి బాలెనో జులై 2022లో 15,573 యూనిట్ల నుండి 2023 జులైలో 17,149 యూనిట్ల మొత్తం అమ్మకాలతో నాలుగో స్థానంలో నిలిచింది.

టాటా నెక్సాన్ 13,767 యూనిట్ల అమ్మకాలతో టాటా మోటార్స్ నుంచి అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది.సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా నిలిచింది.మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ క్రెటా వరుసగా 12,321, 11,880 యూనిట్లను విక్రయించి ఆరు, ఏడవ స్థానాల్లో ఉన్నాయి.10,982 యూనిట్ల విక్రయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.మారుతి సుజుకి ఎర్టిగా 10,494 యూనిట్లను విక్రయించి తొమ్మిదో స్థానంలో నిలిచింది.

మారుతి బ్రెజ్జా ఎస్‌యూవీ 9,941 యూనిట్ల అమ్మకాలతో టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చివరి స్థానంలో నిలిచింది.

Top 10 Selling Cars in India

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube