టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్( Anu Emmanuel ) గురించి మనందరికీ తెలిసిందే.అను ఇమ్మాన్యుయేల్ తెలుగు తమిళ, మలయాళ సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
కాగా ఈ ముద్దుగుమ్మ మొదట నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో( Majnu Movie ) తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి.
మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న అను ఇమ్మానియేల్ ఆ తర్వాత వరసగా అవకాశాలు అందుకుంటూ అది తక్కువ సమయంలోనే ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

ఈమె తెలుగులో అజ్ఞాతవాసి, నా పేరు సూర్య,గీత గోవిందం వంటి సినిమాలు చేసినా ఈ అమ్మడిని ఎప్పటికీ స్టార్ ఇమేజ్ వరించలేదని చెప్పాలి.అలాగే ఇటీవల అల్లు శిరీష్( Allu Sirish ) నటించిన ఊర్వశివో రాక్షశివో సినిమాతో( Urvasivo Rakshasivo ) ప్రేక్షకులను పాలకరించింది.కాగా తాజాగా ఈమె కార్తీ తో కలిసి జంటగా జపాన్ చిత్రంలో( Japan Movie ) నటించింది.ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ మూవీపై అను ఇమ్మానుయేల్ చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పాలి.

కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సర్దుకుపోవడం అనే అంశంపై స్పందిస్తూ.అను ఇమ్మానుయేల్ తనకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది.అయితే ఇలాంటి ఘటనలను కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కొన్నానని తెలిపింది.
ఇలాంటి సందర్భాల్లో సమస్యను ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కోవడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఈమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







