ఈవీల సేల్స్ పెరుగుదలకు భారత ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవే??

ఎలక్ట్రిక్ వాహనాల కారణంగా ప్రయాణాల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.అందుకే మన దేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది.2022లో ఈవీ అమ్మకాల్లో 210 శాతం వృద్ధి నమోదయిందంటే వీటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికే ఇండియాలో లక్షల కొద్దీ ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై తిరిగేస్తున్నాయి.

 These Are The Things That The Indian Government Should Do To Increase The Sales-TeluguStop.com

రెండు మూడు సంవత్సరాల్లో ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు కనిపించే అవకాశం లేకపోలేదు.

అయితే కొందరు ఇప్పటికీ కొన్ని కారణాలవల్ల ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడటం లేదు.

వీరి కోసం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటే భారతదేశంలో పెట్రోల్ వాహనాలు కనుమరుగు కావడం ఖాయం.వచ్చేనెల కేంద్రం బడ్జెట్ 2023 ప్రవేశపెట్టనుంది.

ఈ బడ్జెట్ సందర్భంగా ఈవీల విషయంలో కేంద్రం కొన్ని మంచి నిర్ణయాలను ప్రకటిస్తే వీటి మాడక మరింత పెరిగే అవకాశం ఉంది.ఆ నిర్ణయాలలో జీఎస్టీ తగ్గించడం అనేది కంపల్సరీ అని చెప్పవచ్చు.

జీఎస్‌టీ తగ్గిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది.

Telugu Budget, Ev, Ev Budget, Ev India, Indian-General-Telugu

కేవలం పర్సనల్ వెహికల్స్ విషయంలోనే కాకుండా కమర్షియల్ వెహికల్స్ ని కూడా తీసుకొచ్చేందుకు కంపెనీలకు, కొనుగోలు చేసేందుకు వ్యాపారులకు ప్రభుత్వం సపోర్ట్ అందించాలి.అందుకు కమర్షియల్ ఈవీల కొనుగోలు కోసం ఇచ్చే లోన్స్‌పై వడ్డీరేట్లను తగ్గించాలి.ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (FAME-II) ప్రోత్సాహాలను కూడా బాగా పొడిగిస్తే కొనుగోలుదారులకు హెల్ప్ అవుతుంది.

Telugu Budget, Ev, Ev Budget, Ev India, Indian-General-Telugu

ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్స్‌ తో పాటు అన్ని రకాల ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు కిలోవాట్‌కు రూ.15,000 చొప్పున ప్రోత్సాహాకాలు ఇస్తే బాగుంటుందని పరిశ్రమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం ఈవీల మొత్తం ధరలో రాయితీ పరిమితి 40 శాతంగా ఉండగా దీనిని 2024, మార్చి 31 తర్వాత కూడా కంటిన్యూ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.అలాగే ఈవీల కోసం ఛార్జింగ్‌ మౌలిక వసతులు పెంచితే ఎక్కువ మంది ప్రజలు వీటినే కొనుగోలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube