ఖమ్మం బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నారని నిరూపించగలరా అని ప్రశ్నించారు.
నీళ్ల గురించి మాట్లాడుతున్న కేసీఆర్ 150 టీఎంసీల నీరు కూడా వాడుకోలేకపోతున్నారన్నారు.పోతిరెడ్డిపాడుకు ఏపీ సీఎం నీళ్లు తరలిస్తున్నా కేసీఆర్ సర్కార్ నిద్ర వీడటం లేదని విమర్శించారు.
రైతులకు ఇచ్చిన సబ్సడీలను సైతం తెలంగాణ ప్రభుత్వం ఎత్తేసిందని ఆరోపించారు.రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను ఎలా పరిష్కరిస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
కుమారస్వామి, నితీశ్ కుమార్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.







