గర్భం దాల్చిన మహిళలలో కనిపించే లక్షణాలు ఇవే..!

ఈ భూమి మీద తల్లి ప్రేమకు మించినది ఏదీ లేదు.తల్లి అవ్వాలని వివాహమైన ప్రతి మహిళ కోరుకుంటుంది.

వివాహం అయినా మహిళా గర్భం దాల్చినప్పుడు కలిగే ఆనందమే వేరు.ఎంతో కాలంగా కంటున్నా కలలు నిజమైన వేళ కలిగే ఆనందం మాటల్లో చెప్పలేరు.

అయితే చాలామంది మహిళలు కూడా గర్భం దాల్చిన తర్వాత వారు తల్లి కాబోతున్నారని తెలుసుకోలేక పోతుంటారు.వారిలో కొన్ని లక్షణాలు కనిపించినప్పటికీ వాటిని వారు సరిగ్గా గుర్తించలేకపోతున్నారు.

అయితే ఈ లక్షణాలు అందరిలో ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు.వారి శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి.

Advertisement

కొంతమందిలో అయితే అసలు ఎలాంటి లక్షణాలు కనిపించవు.గర్భం దాల్చిన తర్వాత అందరిలో మొదట కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే గర్భం( pregnancy ) దాల్చిన తర్వాత నెలసరి రాదు.నెలసరి రావడం ఆలస్యం అయిన పది రోజుల తర్వాత వైద్యుని సంప్రదించి కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి.

అలాగే కొందరిలో వాంతులు, వికారం, తలనొప్పి( Vomiting, nausea, headache ), తల తిరిగినట్లుగా కూడా ఉంటుంది.అన్నం అసలు తినాలనిపించదు.కూరల వాసనను అసలు భరించలేక పోతారు.

అదే విధంగా కొందరిలో కడుపునొప్పి వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి.గర్భాశయంలో పిండం స్థిరపడేటప్పుడు ఈ విధంగా నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

అలాగే కొందరిలో చాతి పరిమాణం పెరిగినట్లుగా కూడా అనిపిస్తుంది.వారి స్థానాలు గట్టిగా మారుతాయి.

Advertisement

ఇంకా అలాగే స్థానాలు సున్నితంగా కూడా మారుతాయి.

అయితే కొందరిలో నెలసరి వచ్చే ముందు కూడా ఈ లక్షణాలే కనిపిస్తాయి.ఇక వీటినే ఫ్రీ మెనుస్ట్రువల్ సిండ్రోమ్( Free menstrual syndrome ) అని కూడా పిలుస్తారు.అయితే ఈ లక్షణాలు మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించడం మంచిది.

గర్భం దాల్చిన రెండు వారాల నుంచి ఎక్కువగా ముత్రానికి వెళ్లవలసి వస్తుంది.సాధారణ సమయంలో పల్చగా వచ్చే వైట్ డిస్చార్జ్ గర్భంతో ఉన్నప్పుడు చాలా చిక్కగా వస్తుంది.

తాజా వార్తలు