తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో తెలివైన డైరెక్టర్ ఎవరు అంటే అది సుకుమార్ ( Sukumar )అనే చెప్పాలి.ఈయన తీసిన మొదటి సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా( Pushpa movie ) వరకు ఆయన సినిమాలన్నీ కూడా ఒక డిఫరెంట్ క్యాటగిరిలో నడుస్తూ ఒక్కో సినిమా ఒక్కో ప్రత్యేకతతో ఉంటాయి.
అలాగే ఆయన సినిమా టైటిల్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి.ఒక్కొక్క సినిమా థిమ్ ను బట్టి ఆ సినిమాకి టైటిల్స్ ని డిజైన్ చేస్తాడు.
ఆయన మనకు టైటిల్స్ లోనే కథ చెప్పడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు.దానికి ఉదాహరణ గా ఆర్య 2 టైటిల్స్ కనక తీసుకున్నట్టు అయితే అందులో బుక్ పైన రాసినట్టుగా టైటిల్స్ ని డిజైన్ చేశాడు.
అంటే ఆర్య ,అజయ్ ఇద్దరు ఒకరు పెన్ను అయితే మరొకరు పేపర్ లాంటివారు అంత మంచి ఫ్రెండ్స్ అని వాళ్ళని ఉద్దేశించి అలా డిజైన్ చేశాడు.అంటే పేపర్ లేనిదే పెన్ను లేదు.
పెన్ను లేనిదే పేపర్ లేదు అన్నట్టుగా ఈ సినిమాలోని క్యారెక్టర్లు ఉంటాయి.కాబట్టి వాటిని చాలా కొత్త గా డిజైన్ చేసి అంత మంచి ఫ్రెండ్షిప్ ఈ సినిమాలో ఉంటుంది అనే విధంగా సినిమాకి టైటిల్స్ ని డిజైన్ చేశాడు…

అలాగే 100% లవ్ సినిమా( 100% Love ) కనక చూసుకుంటే ఈ సినిమాలో ర్యాంకుల గురించి గొడవ ఉంటుంది కాబట్టి ర్యాంకులు చదువుకు సంబంధించిన సీక్వెన్స్ లో టైటిల్స్ ని ఓపెన్ చేయడం జరిగింది.ఇక ఆయన మహేష్ బాబు తో తీసిన సినిమా అయిన వన్ నేనొక్కడినే సినిమాలో చివర్లో మహేష్ బాబు వాళ్ళ అమ్మానాన్నలని కనుక్కొనే ఒక థీమ్ సాంగ్ తో సినిమాలో ఏవైతే క్లూస్ ఉన్నాయో వాటిని టైటిల్స్ లో మనకు ముందుగానే రివిల్ చేయడం జరుగుతుంది.ఇక అలాగే ఆయన తీసిన జగడం సినిమా( Jagadam )లో కూడా ఒక బల్బ్ అనేది అటు ఇటు కదులుతూ వెలుగుతూ ఆఫ్ అవుతూ ఉంటుంది.
అంటే హీరో క్యారెక్టైజేషన్ కూడా ప్రస్తుతానికి డైలమాలో ఉంది అని ఆ టైటిల్స్ ని అలా డిజైన్ చేయడం జరుగింది.

అలా ఒక్కో సినిమాకి ఒక్కొక్క వెర్షన్ లో టైటిల్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది.ఇక టైటిల్స్ లోనే అంత కొత్తదనాన్ని చూపించే సుకుమార్ సినిమాని ఇంక చాలా కొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.అందులో భాగంగానే కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి మరికొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి.
వాటితో సంబంధం లేకుండా ఆయన సినిమా తీస్తూ ఉంటాడు…
.







