డబ్బులు చెల్లించకుండా వీక్షించగలిగే ఓటీటీ యాప్స్ ఇవే

కరోనా మహమ్మారి వేళ లాక్‌డౌన్ విధించడంతో సినిమా హాలు మూసివేశారు.దీంతో సినీ ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటు పడ్డారు.

 These Are The Ott Apps That Can Be Viewed Without Paying Money , Free Ott , App-TeluguStop.com

తాజా సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూడటానికి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు.ఇప్పుడు అంతా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ యాప్‌లలో చాలా సినిమాలు నేరుగా విడుదలయ్యాయి.

దీంతో సినిమాలు, వెబ్ సిరీస్‌ల ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ట్రెండ్‌లో ఉంది.ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లోనే సినిమాలను, వెబ్ సిరీస్‌లను చూడాలని భావిస్తున్నారు.

అయితే చాలా ఓటీటీ యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.ఒక్కో యాప్‌కు అధిక మొత్తంలో వెచ్చించ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అయితే కొన్ని ఓటీటీ యాప్‌లను డబ్బులు చెల్లించకుండానే ఉపయోగించవచ్చు.అవేంటో తెలుసుకుందాం.

ఎంఎక్స్ ప్లేయర్

సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉచితంగా చూడాలనుకునే వారికి చక్కటి పరిష్కారం ఈ యాప్.ఇందులో బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్ సినిమాలను ఉచితంగా వీక్షించవచ్చు.ఎన్నో భారతీయ సినిమాలు, వెబ్-సిరీస్, టీవీ-షోలు, తాజా పాటలు, మ్యూజిక్ వీడియోలు వంటివి ఎన్నో ఉంటాయి.

జియో సినిమా

ఈ యాప్‌ను ప్రత్యేకంగా సినిమాలు, టీవీ షోలు, మ్యూజిక్ కోసం రూపొందించారు.జియో యూజర్లంతా ఎటువంటి చెల్లింపు లేకుండా ఈ యాప్‌ను వీక్షించవచ్చు.ఈ ఉచిత ఓటీటీ యాప్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఉన్నాయి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌‌ట్రీమ్

ఈ యాప్‌లో చెల్లింపు చార్జీలు లేకుండా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూడొచ్చు. కొంచెం రుసుము చెల్లిస్తే అన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లను వీక్షించవచ్చు.

ఇతర ప్రముఖ ఓటీటీ యాప్‌లలోని సినిమాలు ఇందులో ప్రసారం అవుతాయి.ఇది కూడా ఓటీటీ వీక్షకులకు మంచి యాప్ అని చెప్పొచ్చు.

వూట్

ఈ యాప్‌లో 18 రకాల ఛానళ్లు ప్రసారం అవుతాయి.వాటితో పాటు ఎంతో ఉత్కంఠను, వినోదాన్ని పంచే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడొచ్చు.

ట్యూబీ

మన దేశంలో హాలీవుడ్ సినిమాలు చూసే వారి సంఖ్య అధికంగానే ఉంది.అలాంటి వారికి ఈ యాప్ చక్కటి వినోదాన్ని అందిస్తుంది.

ఎన్నో హాలీవుడ్ మూవీలు ఈ యాప్‌లో లభిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube