విశ్వక్ సేన్ నటించిన ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం' ను జూన్ ౩ నుండి ప్రసారం చేయనున్న ఆహా

100 % లోకల్ వినోదం అంటే ఆహా.అలా తనకి తానే ప్రేక్షకులకి అభిరుచులకు తగ్గట్టుగా మార్చుకుంటున్న మన ఓ టి టి ప్లాట్ ఫాం ఈసారి ఒక మంచి ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా తో అందరిని అలరించబోతుంది.

 Family Entertainer Film 'ashoka Vanamlo Arjuna Kalyanam' Starring Vishwak Sen Wi-TeluguStop.com

మండుతున్న ఎండలో చల్లగా అందరిని నవ్వించడానికి జూన్ 3న ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాని ఆహా మనముందుకు తీసుకొనివస్తుంది.పెళ్లెప్పుడు చేసుకుంటావ్ రా అబ్బాయ్.30 ఏళ్లు పైబడ్డాయ్ పప్పన్నం పెట్టవా?.పైన జుట్టు ఊడుపోతుంది.

కింద పొట్టపెరిగిపోతుంది.ఇంకెప్పుడు పెళ్లి.? ఇలాంటి ప్రశ్నలు 30 ఏళ్లు దాటిన ప్రతి యువతీయువకులకు ఎదురవుతూనే ఉంటాయి.అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పక్కింటోడు అడిగాడనా?.లేదంటే వయసు అయిపోతుందనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా.

తెలంగాణ లోని సూర్యాపేట లో వడ్డీ వ్యాపారం చేసే అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్)కి తన కులంలో సంబంధాలు దొరక్కపోవడంతో కులాంతర వివాహానికి రెడీ అవుతాడు.

ఆంధ్రా అమ్మాయి మాధవి (రుక్సార్ ధిల్లాన్)‌తో పెళ్లి ఫిక్స్ చేసుకుంటారు.ఎంగేజ్‌మెంట్ కోసం బంధుమిత్రులతో తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తాడు.అయితే సరిగ్గా అదే టైంకి లాక్ డౌన్ ప్రకటించడంతో పెళ్లి వాళ్ల ఇంట్లో లాక్ అయిపోతారు.సరిగ్గా పెళ్లి ముహూర్తం సమీపిస్తున్న టైంలో పెళ్లి కూతురు జంప్ అవుతుంది.

మాధవి అర్జున్ కుమార్‌ని వదిలి ఎందుకు లేచిపోతుంది.అసలు అర్జున్ పెళ్లి ఎవరితో జరుగుతుంది ? ఎప్పుడు అవుతుంది.అని తెలుసుకోవాలంటే జూన్ 3 నుండి ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube