అక్టోబర్ నెలలో లాంచ్ కానున్న నయా ఫోన్లు ఇవే..!

కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా.అయితే అక్టోబరు నెలలో మీకు లెక్కలేనన్ని ఆప్షన్లు లభించనున్నాయి.

 These Are The New Phones That Will Be Launched In The Month Of October October-TeluguStop.com

ఈ నెలలో చాలా కంపెనీల నుంచి అదిరిపోయే ఫోన్లు లాంచ్ అవుతున్నాయి.వాటిపై ఇప్పుడు లుక్కేద్దాం.

పిక్సెల్ 7 సిరీస్‌

పిక్సెల్ 7 సిరీస్‌లో భాగంగా పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో మోడల్స్‌ను అక్టోబరు 6న గూగుల్ లాంచ్ చేస్తోంది.వీటి ధరలు రూ.55 వేల నుంచి ప్రారంభమవుతాయి.ఇండియాలో కూడా ఇవి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3

Telugu Motorola Edge, October, Tech-Latest News - Telugu

వన్‌ప్లస్‌ నార్డ్ 3 మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేతో ఈ నెల చివరిలో రిలీజ్ కానుంది.దీని ధర రూ.30-రూ.35 వేల మధ్య ఉండొచ్చు.

మోటో ఎడ్జ్‌ 30 నియో

Telugu Motorola Edge, October, Tech-Latest News - Telugu

మోటో ఎడ్జ్‌ 30 నియో మోడల్‌ 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.28 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ డిస్‌స్లేతో ఈ నెలలోనే ఇండియాలో విడుదల కానుంది.ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఆఫర్ చేశారు.దీని ధర రూ.20 వేల వరకు ఉండొచ్చని సమాచారం.

షావోమి 12 లైట్‌

షావోమి 12 లైట్‌ అక్టోబరు మూడో వారంలోగా విడుదల చేయొచ్చు.ఇందులో స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ ఆఫర్ చేసినట్లు సమాచారం.దీని ధర రూ.30 వేల వరకూ ఉండే అవకాశం ఉంది.

షావోమి 12టీ సిరీస్‌

6.67 అంగుళాల 2k అమోలెడ్ డిస్‌ప్లే, 120 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 200 ఎంపీ మెయిన్ కెమెరా, స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్ ‌1 ప్రాసెసర్‌తో షావోమి 12టీ సిరీస్‌ ఫోన్లు ఇదే నెలలో మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి.వీటి ధరలను రూ.50 వేల నుంచి రూ.60 వేలుగా నిర్ణయించవచ్చు.

పైన పేర్కొన్న మొబైల్ ఫోన్లతో పాటు రియల్‌మీ 10, 10 ప్రో, 10 5జీ, 10 అల్ట్రా, 10+ వేరియంట్లు కూడా అక్టోబర్ నెలలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.ఇక రూ.20 వేలు ధరతో వివో వి25ఈ, రూ.15 వేలు ధరతో పోకో ఎమ్‌5ఎస్‌ రిలీజ్ కానుందని టాక్.రూ.9 వేల నుంచి రూ.10 వేల మధ్యలో ఒప్పో ఏ17, ఒప్పో ఏ77ఎస్‌ కూడా భారతదేశానికి రానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube