సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (CPA) అయిన రుషి పటేల్ ( Rushi Patel )ఇటీవల టెక్సాస్‌లోని పెర్‌ల్యాండ్ సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు.అలా ఈ ఘనత సాధించిన మొదటి ఆసియా-అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు.
అతను కౌన్సిల్ ఎన్నికలలో ఆంటోనియో జాన్సన్‌ను ఓడించి 57% పైగా ఓట్లను పొందారు.ఎలక్షన్స్‌లో కౌన్సిల్ పొజిషన్ 7లో ఆయన గెలిచారు.
ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రుషి పటేల్ తన అన్నదమ్ములతో కలిసి హ్యూస్టన్ ప్రాంతంలో అనేక హోటళ్లను రన్ చేస్తున్నారు.
పెర్‌ల్యాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రుషి ఒక సభ్యుడిగా ఉండేవారు.అప్పుడే అతనికి సమాజంపై మరింత ఆసక్తి పెరిగింది.
వారికోసం ఏదైనా చేయాలనే తపన కూడా మొదలైంది.ఆ తపనతో చివరికి అతను కౌన్సిల్‌మెన్‌గా మారారు.

రుషి పటేల్ తొమ్మిదేళ్ల వయసులో భారతదేశం నుంచి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు.తరువాత అకౌంటింగ్‌పై దృష్టి సారించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ కంప్లీట్ చేశారు.అలాగే సౌత్ కరోలినా యూనివర్సిటీ ( University of South Carolina )నుంచి టాక్సేషన్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు.అతను కూడా తన తండ్రి బిపిన్ పటేల్ వలె CPA డిగ్రీని ఫినిష్ చేశారు.
తన రాజకీయ జీవితానికి ముందు, అకౌంటింగ్ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌లో రెండేళ్లకు పైగా పనిచేశారు.

పటేల్ తండ్రి గుజరాత్‌లోని చారుసత్ యూనివర్సిటీ, శ్రీ చారోటట్ మోతీ సత్తావిస్ పటీదార్ కెలవాని మండల్‌లో చార్టర్డ్ అకౌంటెంట్‌గా వర్క్ చేశారు.ఇంటర్నల్ ఆడిటర్‌గానూ కొనసాగారు.2003లో, పటేల్ తన మొదటి హోటల్ అయిన హాంప్టన్ ఇన్ బై హిల్టన్‌ను పెర్‌ల్యాండ్‌లోని వెస్ట్ బ్రాడ్‌వేలో ప్రారంభించారు.పెర్‌ల్యాండ్ సిటీ కౌన్సిల్ సభ్యునిగా, పటేల్ తన కమ్యూనిటీలో వ్యాపార అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.స్థానిక సమస్యలు, అవసరాల కోసం మంచి నిర్ణయాలను, పాలసీలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.