ప్రముఖ టెక్నాలజీ సంస్థ అసుస్ భారత మార్కెట్లో అసుస్ జెన్ బుక్ డ్యూ ల్యాప్ టాప్( Asus Zen Book Due Laptop ) ను లాంఛ్ చేసింది.ఈ ల్యాప్ టాప్ స్పెసిఫికేషన్ వివరాలతో పాటు ధర వివరాలను తెలుసుకుందాం.
అసుస్ జెన్ బుక్ డ్యూ ల్యాప్ టాప్:
ఈ ల్యాప్ టాప్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్( Gorilla glass protection ) తో డ్యూయల్ 14- అంగుళాల లుమినా ఓలెడ్ టచ్ స్క్రీన్ తో ఉంటుంది.విండో11 హోం ఔటాఫ్ వర్షన్ పై పనిచేస్తుంది.ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ తో పాటు 32GB RAM సామర్థ్యంతో ఉంటుంది.65W USB టైప్-C పోర్టు మద్దతుతో 75W బ్యాటరీ కలిగి ఉంటుంది.డిటాచబుల్ ఎర్గో సెన్స్ కీ బోర్డు( Detachable Ergo Sense keyboard ) , టచ్ పాడ్ విత్ మల్టీ టచ్ గెస్చర్స్ కలిగి ఉంటుంది.
ఈ ల్యాప్ టాప్ ఫుల్ HD ప్లస్ (1900*1200 పిక్సెల్) ఓలెడ్ టచ్ స్క్రీన్స్ విత్ 100 శాతం DCI:P3 కలర్ గమట్ కవరేజ్, ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ ( Intel Arc Graphics )తో పాటు ఇంటెల్ కోర్ అల్ట్రా 9 CPUS ఉంటాయి.32GB RAM తో పాటు 2టిగా బైట్స్ SSD స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది.
ఈ ల్యాప్ టాప్ వైఫై 6ఈ, బ్లూటూత్ 5.3, టూ థండర్ బోల్ట్ 4పోర్ట్స్, వన్ USB 3.2 జెన్ 1 టైప్-A పోర్ట్, HDMI 2.1 పోర్టు, 3.5ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లతో ఉంటుంది.ఫేషియల్ రికగ్నిషన్ అండ్ వీడియో కాల్స్ కోసం ఆంబియెంట్ లైట్ సెన్సర్ తో పాటు ఫుల్ HD AI సెన్స్ IR కెమెరా తో వస్తోంది.డాల్బీ అట్మోస్ తోపాటు రెండు హార్మోన్ కార్డాన్ ట్యూన్ స్పీకర్లతో ఉంటుంది.
ఇక ఈ ల్యాప్ టాప్ ధర విషయానికి వస్తే.ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్ తో కూడిన అసుస్ జెన్ బుక్ డ్యూ 2024 ల్యాప్ టాప్ ధర రూ.159990 గా ఉంది.ఇంటెల్ కోర్ అల్ట్రా 7 వేరియంట్ ధర రూ.199990 గా ఉంది.ఇంటెల్ కోర్ అల్ట్రా 9CPU తో ఉండే ల్యాప్ టాప్ ధర రూ.219990 గా ఉంది.ఇంటెల్ కోర్ అల్ట్రా 9 CPU ధర రూ.239999 గా ఉంది.