బీజేపీపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ( MIM Leader Akbaruddin Owaisi ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఒకప్పుడు త్యాగాలతో హైదరాబాద్( Hyderabad ) ను దక్కించుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు బీజేపీ నుంచి హైదరాబాద్ ను కాపాడుకోవాలని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు.ఈ క్రమంలో అసదుద్దీన్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు.
సీబీఐ, ఐటీ పేరు చెప్పి బీజేపీ భయపెట్టాలని చూస్తోందన్నారు.బీజేపీ( BJP )కి బీ టీం అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని విమర్శించారు.
అయితే తూటాలు, జైళ్లకు ఒవైసీ బ్రదర్స్( Owaisi Brothers ) భయపడరని ఆయన స్పష్టం చేశారు.







