ఉసిరికాయ గురించి మీకు తెలియని ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

ఈ మధ్యకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే చాలా పెద్ద సవాలుగా మారిపోయింది.

ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఉన్న కాలుష్యం వలన కల్తీ ఆహారం తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తేనే ఆరోగ్యం మంచిగా ఉంటుంది.అయినప్పటికీ కూడా పలు రకాల దీర్ఘ కాలిక వ్యాధులు వెంటాడుతూనే ఉంటాయి.

ఆరోగ్యమనేది మనం తీసుకునే ఆహారం పై ఆధారపడి ఉంటుంది.శరీరానికి పోషకాలు అందించే ఆహారం తీసుకోవడం వలన శరీరం దృఢంగా ఉంటుంది.

ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి.లేదంటే రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి ఉంటుంది.

Advertisement

ఇక చలికాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉసిరికాయ చాలా ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఇందులో మీకు కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి.కాబట్టి శీతాకాలంలో ప్రతి రోజు ఉసిరికాయ( Amla ) తీసుకోవడం మంచిది.

ఎందుకంటే ఇందులో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది.ప్రతిరోజు ఉసిరి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి ( Immunity )కూడా లభిస్తుంది.

దీంతో వ్యాధులు ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.అదేవిధంగా ఉసిరిని తినడం వలన జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా తగ్గిపోతాయి.

దీంతో జుట్టు కూడా దృఢంగా మారుతుంది .

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఇక పైల్స్ సమస్య( Piles problem )లతో బాధపడుతున్న వారు కూడా చలికాలంలో ఉసిరికాయను ( Amla )తినడం వలన ఆ సమస్యల నుండి బయటపడవచ్చు.ఇక ప్రతిరోజు ఉసిరి రసం తాగడం వలన కంటిచూపు సమస్యలు( Eyesight problems ) కూడా దూరం అవుతాయి.ఇక నోటి ఆరోగ్యం మెరుగుపడి, నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది.

Advertisement

ఇక ఉసిరిలో ఉండే గుణాలు రక్తపోటు సమస్యను కూడా నియంత్రిస్తుంది.ఇక అంతేకాకుండా అధిక బరువుతో ఇబ్బంది పడేవారు కూడా ఉసిరి రసాన్ని తాగడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.

ఇక చర్మ సమస్యలు ఉన్నవారు ఉసిరి తిన్న, ఉసిరి రసం తాగిన సమస్యలన్నీ దూరమవుతాయి.

తాజా వార్తలు