వాట్సాప్ లో చాట్ డేటా లీక్ కాకుండా ప్రైవసీ ఇచ్చే ఫీచర్లు ఇవే..!

వాట్సప్( Whatsapp ) ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే.ప్రపంచంలో ఎక్కడికైనా ఆడియో కాల్స్ లేదా వీడియో కాల్స్ చేసుకోవడం, ఫోటోలు, వీడియోలు వేగంగా పంచుకోవడం లాంటి మెరుగైన సేవలను వాట్సాప్ అందిస్తోంది.

 These Are The Features That Give Privacy Without Leaking Chat Data In Whatsapp D-TeluguStop.com

అంతేకాదు వాట్సప్ చాట్ డేటా( Whatsapp Chat Data ) లీక్ కాకుండా ఉండేందుకు కూడా వాట్సాప్ లో సురక్షితమైన ప్రైవసీ ఫీచర్లను( Privacy Features ) వాట్సప్ తీసుకొచ్చింది.ఈ ఫీచర్లతో వాట్సప్ చాట్ డేటా ఎప్పుడు సురక్షితమే.

ఈ ఫీచర్లు ఆన్ లో ఉంటే వాట్సప్ డేటా లీక్ అయ్యే అవకాశం అస్సలు ఉండదు.

Telugu Chat Lock, Messages, Whatsapp-Technology Telugu

వాట్సప్ లో డిసప్పీయరింగ్ మెసేజెస్( Disappearing Messages ) ఫీచర్ ను ఆన్ చేస్తే.ఎంచుకున్న సమయం తర్వాత ఆ చాట్ ఆటోమేటిక్ గా రిసీవర్, సెండర్ ఫోన్ ల నుంచి శాశ్వతంగా డిలీట్ అవుతుంది.అంటే 24 గంటలు, ఏడు రోజులు, 90 రోజులు ఇలా టైం లిమిట్స్ ను ఈ ఫీచర్ అందిస్తుంది.

వీటిలో మీకు నచ్చిన టైం లిమిట్ సెలెక్ట్ చేసి ఆన్ లో ఉంచుకుంటే ఆ సమయం తర్వాత చాట్ రిమూవ్ అవుతుంది.వాట్సప్ లో క్లౌడ్ బ్యాకప్స్( Cloud Backups ) ఎన్ క్రిప్ట్ చేయడం వల్ల గూగుల్ లేదా ఆపిల్ లాంటి టెక్ దిగ్గజాలు సైతం మీ చాట్ ను యాక్సెస్ చేయలేవు.

దీంతో డేటా మొత్తం సురక్షితమే.

Telugu Chat Lock, Messages, Whatsapp-Technology Telugu

చాట్ లాక్( Chat Lock ) ఫీచర్ ఎప్పుడు ఆన్ లో పెట్టుకోవాలి.దీంతో ఎప్పుడైనా ఇతరులు మీ మొబైల్ తీసుకుని వాట్సప్ డేటా చెక్ చేసే అవకాశం ఉండదు.వాట్సప్ లో సైలెన్స్ అన్నోన్ కలర్స్ టర్న్ ఆన్ చేసుకుంటే.

స్పాం కాల్స్ బారిన పడే అవకాశం ఉండదు.వాట్సప్ లో ఎల్లప్పుడూ ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ ఆన్ చేసుకుంటే సెండర్ లేదా రిసీవర్ మాత్రమే చాట్ చూడగలరు.

మూడో వ్యక్తి మీ చార్ట్ చూసే అవకాశం ఉండదు అంతేకాదు వాట్సప్ కూడా వాటిని చూడలేదు.ఈ ప్రైవసీ ఫీచర్లను ఎప్పుడు ఆన్ లో ఉంచుకుంటే మీ వాట్సాప్ డేటా ఎప్పుడు సురక్షితంగానే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube