వాట్సాప్ లో చాట్ డేటా లీక్ కాకుండా ప్రైవసీ ఇచ్చే ఫీచర్లు ఇవే..!

వాట్సప్( Whatsapp ) ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే.ప్రపంచంలో ఎక్కడికైనా ఆడియో కాల్స్ లేదా వీడియో కాల్స్ చేసుకోవడం, ఫోటోలు, వీడియోలు వేగంగా పంచుకోవడం లాంటి మెరుగైన సేవలను వాట్సాప్ అందిస్తోంది.

అంతేకాదు వాట్సప్ చాట్ డేటా( Whatsapp Chat Data ) లీక్ కాకుండా ఉండేందుకు కూడా వాట్సాప్ లో సురక్షితమైన ప్రైవసీ ఫీచర్లను( Privacy Features ) వాట్సప్ తీసుకొచ్చింది.

ఈ ఫీచర్లతో వాట్సప్ చాట్ డేటా ఎప్పుడు సురక్షితమే.ఈ ఫీచర్లు ఆన్ లో ఉంటే వాట్సప్ డేటా లీక్ అయ్యే అవకాశం అస్సలు ఉండదు.

"""/" / వాట్సప్ లో డిసప్పీయరింగ్ మెసేజెస్( Disappearing Messages ) ఫీచర్ ను ఆన్ చేస్తే.

ఎంచుకున్న సమయం తర్వాత ఆ చాట్ ఆటోమేటిక్ గా రిసీవర్, సెండర్ ఫోన్ ల నుంచి శాశ్వతంగా డిలీట్ అవుతుంది.

అంటే 24 గంటలు, ఏడు రోజులు, 90 రోజులు ఇలా టైం లిమిట్స్ ను ఈ ఫీచర్ అందిస్తుంది.

వీటిలో మీకు నచ్చిన టైం లిమిట్ సెలెక్ట్ చేసి ఆన్ లో ఉంచుకుంటే ఆ సమయం తర్వాత చాట్ రిమూవ్ అవుతుంది.

వాట్సప్ లో క్లౌడ్ బ్యాకప్స్( Cloud Backups ) ఎన్ క్రిప్ట్ చేయడం వల్ల గూగుల్ లేదా ఆపిల్ లాంటి టెక్ దిగ్గజాలు సైతం మీ చాట్ ను యాక్సెస్ చేయలేవు.

దీంతో డేటా మొత్తం సురక్షితమే. """/" / చాట్ లాక్( Chat Lock ) ఫీచర్ ఎప్పుడు ఆన్ లో పెట్టుకోవాలి.

దీంతో ఎప్పుడైనా ఇతరులు మీ మొబైల్ తీసుకుని వాట్సప్ డేటా చెక్ చేసే అవకాశం ఉండదు.

వాట్సప్ లో సైలెన్స్ అన్నోన్ కలర్స్ టర్న్ ఆన్ చేసుకుంటే.స్పాం కాల్స్ బారిన పడే అవకాశం ఉండదు.

వాట్సప్ లో ఎల్లప్పుడూ ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ ఆన్ చేసుకుంటే సెండర్ లేదా రిసీవర్ మాత్రమే చాట్ చూడగలరు.

మూడో వ్యక్తి మీ చార్ట్ చూసే అవకాశం ఉండదు అంతేకాదు వాట్సప్ కూడా వాటిని చూడలేదు.

ఈ ప్రైవసీ ఫీచర్లను ఎప్పుడు ఆన్ లో ఉంచుకుంటే మీ వాట్సాప్ డేటా ఎప్పుడు సురక్షితంగానే ఉంటుంది.

వికలాంగుల కోటాలో జాబ్.. డ్యాన్సుల్లో మాత్రం అదరగొడుతోంది.. సెన్సేషనల్ వీడియో లీక్డ్‌!