తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ ( Nominations Withdrawal ) గడువు ముగిసింది.ఈ మేరకు ఏపీలో ( AP ) 25 లోక్ సభ స్థానాలకు గానూ 503 నామినేషన్లు దాఖలు అయ్యాయి.175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లు దాఖలైయ్యాయి.ఇందులో నంద్యాల పార్లమెంట్ కు( Nandyala Parliament ) అత్యధికంగా 36 నామినేషన్లు రాగా.
రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి అత్యల్పంగా 12 నామినేషన్లు వచ్చాయి.అలాగే తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 48 నామినేషన్లు దాఖలైయ్యాయి.
అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ స్థానానికి ఆరు నామినేషన్లు వచ్చాయి.ఇక ఆరు స్థానాల్లో కూటమి రెబల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.మరోవైపు తెలంగాణలోనూ( Telangana ) నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.అయితే తెలంగాణలో నామినేషన్లను అభ్యర్థులు భారీగా ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది.
మే 13వ తేదీన పోలింగ్ జరగనుండగా.జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.