చాణక్య నీతి: మీ నిజమైన స్నేహితుణ్ణి ఇలా గుర్తించండి!

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి తన నిజమైన స్నేహితులను గుర్తించడం ఎంతో ముఖ్యం.

ఎందుకంటే ఒకరి ముఖాన్ని చూసి, అతను మీ సన్నిహిత మిత్రుడని, లేదా ఏదో ప్రయోజనం కోసం మీతో స్నేహం చేస్తున్నాడ‌ని మీరు అస్సలు ఊహించలేరు.

అటువంటి పరిస్థితిలో, నిజ‌మైన స్నేహితుడిని ఎలా తెలుసుకోవాలో ఆచార్య చాణక్య తెలిపారు.ఆచార్య చాణక్యుడు ఎదుటి వ్య‌క్తి మీ నిజమైన మిత్రుడా కాదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు నాలుగు మార్గాల గురించి చెప్పారు.

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివ‌రాల ప్రకారం అనారోగ్యంతో ఉన్నప్పుడు అకాల శత్రువులు చుట్టుముట్టబడినప్పుడు, రాజ పనిలో సహాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు, శ్మశాన వాటికకు తీసుకెళ్లడానికి సహాయం చేసేవాడు నిజమైన స్నేహితుడ‌ని చాణ‌క్య తెలిపారు అనారోగ్యంల మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు మీర‌నుకునే స్నేహితుడు అండ‌గా నిలబడితే, అతను నిజమైన స్నేహితుడని అర్థం చేసుకోండి.ఎందుకంటే ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, చాలామంది అతనికి దూర‌మ‌వుతారు.

అటువంటి పరిస్థితిలో మీకు అన్ని విధాలుగా అండగా ఉండేవాడే నిజ‌మైన స్నేహితుడు.శత్రువులు చుట్టుముట్టిన‌ప్పుడు ఏవో కారణాల వల్ల మీరు శత్రువు బారిన‌ప‌డిన‌ప్పుడు లేదా ఏదైనా సంక్షోభంలో కూరుకుపోయిన‌ప్పుడు నిజ‌మైన స్నేహితుడు మాత్ర‌మే మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు.

Advertisement

మీ సమస్యలను తన సొంత సమస్యగా భావించినట్లయితే అతనే మీ నిజమైన స్నేహితుడని గ్ర‌హించండి.అన్నివిష‌యాల్ల మీ స్నేహితుడు మీరు చేసే ప్ర‌తిపనిలో మీకు మద్దతు ఇస్తే.

అతను ప్రతి విషయంలో మీకు సహాయం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తే, అతనే మీ నిజమైన స్నేహితుడని అర్థం చేసుకోండి దహన సంస్కారాల స‌మ‌యంలోఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, మీకు అండ‌గానిలిస్తే అతను నిజమైన స్నేహితుడని గుర్తెర‌గండి.ఎందుకంటే కపట మిత్రుడు మీ సంతోషంలో మీ పక్షాన నిలుస్తాడు.

దుఃఖం వచ్చిన వెంటనే పారిపోతాడు.అందుకే మీ బాధలో కూడా ఎవ‌రైనా మీకు తోడుగా నిల‌బ‌డితే అతనే మీ నిజమైన స్నేహితుడు అని అర్థం చేసుకోండి.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు