ఏపీలో రాష్ట్రపతి పాలన...? ఓహో ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తోందా ...?

ఏపీలో తమకు తలనొప్పిగా మారడమే కాకుండా… కేంద్రం లో అధికారంలో ఉండి కూడా ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏమీ చేయలేకపోతున్నాము అనే కసితో కేంద్ర ప్రభుత్వం ఉంది.అందుకే… ఎలా అయినా టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది.అయితే… సరైన అవకాశం మాత్రం బీజేపీ ప్రభుత్వానికి రావడంలేదు.అందుకే ఏపీలో రాష్ట్రపతి పాలన వచ్చేలా చేసి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కేంద్రం చూస్తోంది.

 There Will Be A President Rule In Andhra Pradesh 2019-TeluguStop.com

గతంలో అనేక రాష్ట్రాల్లో ప్రయోగించిన ఫార్ములానే ఏపీలోనూ ప్రయోగించాలని కేంద్రం చూస్తోంది.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత … ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు అన్ని చోట్లా.రాష్ట్రపతి పాలన ప్రయోగించి.ప్రభుత్వాల్ని మార్చేశారు.ఈశాన్యంలో పట్టు సాధించారు.ఇప్పుడు అదే వ్యూహాన్ని ఏపీలో అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో ఏపీ లో ఏ చిన్న అలజడి జరిగినా… ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టేయాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేయడం ఎక్కువయిపోయింది.అయితే… శాంతిభద్రతల విషయంలో అట్టడుగున ఉండే.యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో .ఏం జరిగినా.రాష్ట్రపతి పాలన అనే మాటే వినిపించదు.కానీ.ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా మాట్లాడుతుంటారు బీజేపీ నేతలు.ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని అడుగడుగునా… విమర్శిస్తూ… ఇబ్బందిపెడుతున్న జీవీఎల్ నరసింహారావు నేరుగా ముఖ్యమంత్రికే హెచ్చరికలు జారీ చేశారు.

ఇది మొదటి సారి కాదు.గతంలో అమిత్ షా తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు కన్నా జిల్లాల పర్యటనల్లో ప్రజలు విభజన హామీలు నెరవేర్చాలని నిరసన వ్యక్తం చేసినప్పుడూ ఇదే డిమాండ్ వినిపించారు.

ఇక విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ మీద జరిగిన దాడి వ్యవహారం లో కూడా బీజేపీ చాలా యాక్టివ్ గా స్పందించింది.ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందేనని బీజేపీ నాయకులంతా డిమాండ్ పెట్టేసారు.అయితే ఈ వ్యవహారం అప్పట్లోనే అనేక అనుమానాలను రేకెత్తిచింది.ఓ వైపు గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేయడం.అక్కడ జీవీఎల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లు మాట్లాడటంతో… ఏదో జరగబోతోందన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తం అయ్యాయి.

కానీ బీజేపీ నాయకుల వ్యవహారం అంత తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదు.ఓ పద్దతి ప్రకారమే ఏపీలో రాష్ట్రపతి పాలనకు ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు టీడీపీ నాయకుల్లో పెరిగిపోయింది.దీంతో పాటు జగన్ మీద జరిగిన దాడి వ్యవహారంలో ఈ కేసును ఎన్.ఐ.ఏ చేతికి వచ్చేలా తెరవెనుక మంతనాలు చేసినట్టు టీడీపీ నమ్ముతోంది.బీజేపీ మాత్రం ఏదో ఒక వంకతో రాష్ట్రపతి పాలన వచ్చేలా చేయాలనే ఉద్దేశంతో … సరైన అవకాశం కోసం బీజేపీ ఎదురుచూపులు చూస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube