‘ వ్యూహాం’ సినిమాలో ఎలాంటి వ్యూహం లేదు..: ఆర్జీవీ

విజయవాడలో రేపు ‘వ్యూహాం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.ఈ మేరకు ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిశీలించారు.

పరిశీలన అనంతరం ఆర్జీవీ మాట్లాడుతూ తమ ‘ వ్యూహాం’ సినిమాలో ఎలాంటి వ్యూహం లేదని చెప్పారు.సీఎం జగన్ కు ఈ వ్యూహానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

తమ ఆలోచనతో రూపకల్పన చేసిన సినిమా తీశామన్నారు.ఈ చిత్రం ద్వారా ఒక నిజాన్ని చెప్పబోతున్నామన్న ఆర్జీవీ ఈ మూవీలో తెలంగాణ రాజకీయాలు లేవని వెల్లడించారు.

అలాగే తమ మూవీ ఈవెంట్ కు కొందరు వైసీపీ నేతలు హాజరు అవుతారని తెలిపారు.

Advertisement
పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?

తాజా వార్తలు