అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ అధ్యక్షుడు పార్థసారథి ( TDP President Parthasarathy )నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.అనంతపురంలో బీకే పార్థసారథి ఇంటిని పార్టీ నాయకులు ముట్టడించారు.
ఈ క్రమంలోనే ధర్మవరం నియోజకవర్గ టికెట్ ను పరిటాల శ్రీరామ్( Paritala Sriram ) కు కేటాయించాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు.కష్టకాలంలో శ్రీరామ్ తమకు అండగా ఉన్నారని చెబుతున్నారు.
బీజేపీ నేత సూరి తమను ఏ రోజూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అటువంటి వ్యక్తికి టెకెట్ ఇస్తే తమ పరిస్థితి ఏంటని నిలదీశారు.
ఈ క్రమంలోనే హిందూపురం( Hindupuram ) అధ్యక్షుడు పార్థసారథి ఇంటిని నాయకులు చుట్టుముట్టారు.శ్రీరామ్ కు టికెట్ కేటాయించేంత వరకు ఇక్కడి నుంచి కదలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
దీంతో పార్థసారథి నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది.మరోవైపు నాయకుల నిరసన నేపథ్యంలో ధర్మవరం టికెట్ కేటాయింపు వ్యవహరాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పార్థసారథి తెలిపారని సమాచారం.