'బాదుడే బాదుడు ' బాబు ని ఆదుకుంటుందా ?

బాదుడే బాదుడు‘ పేరుతో టీడీపీ గత  కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది.  వైసీపీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా ధరలు పెంచుతోందని , విద్యుత్ చార్జీలతో పాటు మరెన్నిటినో పెంచారని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది.

 There Is A Debate Over Whether Chandrababu Will Succeed In His Fight Against The-TeluguStop.com

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ బాదుడే బాదుడు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు .నేటి నుంచే దానికి శ్రీకారం చుట్టారు.రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్వయంగా ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని వైసిపి ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే విధంగా బాబు ప్లాన్ చేసుకున్నారు.

        ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని దల్లావలస గ్రామంలో బాబు పర్యటించబోతున్నారు .అలాగే ఈ నెల 5వ తేదీన భీమిలి నియోజకవర్గం తాళ్లవలస గ్రామంలోను, 6న ముమ్మిడివరం నియోజకవర్గం కోరంగి గ్రామం లోనూ చంద్రబాబు స్వయంగా ‘ బాదుడే బాదుడు ‘ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.త్వరలో జరగబోయే మహానాడు వరకు బాబు ఈ తరహా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రణాళిక వేసుకున్నారు.

అయితే ఈ తరహా కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం పెరుగుతోంది.చంద్రబాబుకు ఇది కలిసి వస్తుందా లేదా అనేది పార్టీ నేతల్లోనూ చర్చనీయాంశంగా మారింది.2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి చెందిన దగ్గర నుంచి నిత్యం ఏదో ఒక అంశంపై టిడిపి ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉంది.
     

Telugu Ap Cm Jagan, Ap, Badude Badudu, Chandrababu, Jagan, Ysrcp-Telugu Politica

   ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత తీవ్రంగా ఉందని, జగన్ పరిపాలన ఏమాత్రం బాలేదు అంటూ పదేపదే చంద్రబాబు ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తూనే వచ్చారు.ఆయన వరుసగా జరిగిన స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలు ఇలా అన్నిటిలోనూ వైసిపి హవానే కొనసాగింది.ఇప్పుడు ఈ బాదుడే బాదుడు తరహా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా టిడిపి, చంద్రబాబు ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేదే ఆసక్తికరంగా మారింది .

   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube