జయాపజయాలతో సంబంధం లేకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న వాళ్లలో ధనుష్ ఒకరు.చాలా సంవత్సరాల క్రితం వృద్ధ దంపతులు ధనుష్ తమ కొడుకే అని కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
మీనాక్షి, కదిరేశన్ దంపతులు ధనుష్ తమ మూడో కొడుకు అని బాల్యంలో సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇంటినుంచి పారిపోయాడని చెబుతున్నారు.ధనుష్ తమ కొడుకే అని తమకు నెలకు 65,000 రూపాయలు బాగోగుల కోసం ఇప్పించాలని వృద్ధ దంపతులు కోరుతున్నారు.
గతంలో ఈ దంపతులు మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చింది.అయితే తాజాగా ఈ దంపతులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు విషయంలో మరో మలుపు చోటు చేసుకుంది.
మద్రాస్ హైకోర్టు ధనుష్ కు సమన్లు జారీ చేసింది.ధనుష్ గతంలో తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించి కేసును కొట్టేయించుకున్నాడని ఈ దంపతులు చెబుతుండటం గమనార్హం.గతంలో డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని కోర్టు సూచించిన ధనుష్, అతని లాయర్లు అందుకు అంగీకరించలేదు.
వృద్ధ దంపతులు చెప్పిందే నిజం కావచ్చని డీఎన్ఏ టెస్ట్ కు ధనుష్ నో చెప్పడం వల్ల కొంతమంది సందేహాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

కదిరేశన్ దంపతులు ఈ కేసులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చేవరకు ఈ కేసు విషయంలో రాజీ పడే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది.మరోవైపు ధనుష్ నటించి తాజాగా ఓటీటీలో విడుదలైన మారన్ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

ధనుష్ ప్రస్తుతం సర్ అనే సినిమాతో పాటు ది గ్రే మ్యాన్ అనే ఇంటర్నేషనల్ సినిమాలో నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.మరోవైపు ధనుష్ ఐశ్వర్య దంపతులు విడిపోయిన సంగతి తెలిసిందే.ధనుష్ సినీ కెరీర్ బాగానే ఉన్నా వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు.







