సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.సినిమాల్లో, రాజకీయాల్లో పవన్ బిజీ అయిపోయారు.
పవర్ స్టార్ నటించిన చిత్రం బ్రో సినిమా జులై 28న విడుదలైంది.మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది బ్రో సినిమా.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఒకే స్క్రీన్ పై కనిపించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.అయితే ఈ సినిమాని కేవలం 45 రోజుల్లో కంప్లీట్ చేయడం విశేషం.
ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించగా థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్( Pawan kalyan ) స్టైలిష్ గా కనిపించారు.
పవన్ కళ్యాణ్ సినిమాల పాటలని ఈ సినిమాలో వాడడంతో మరింత క్రేజ్ పెరిగింది.ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించారు.
అయితే ఇప్పుడు సముద్రఖనిపై పవన్ అభిమానులు సీరియస్ అవుతున్నారనే టాక్ నడుస్తుంది.ఎందుకో ఇప్పుడు చూద్దాం.

త్రివిక్రమ్( Trivikrram ) డైలాగులు, మాటలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే.అందులో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే హైప్ మాములుగా ఉండదు.ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.మళ్ళీ బ్రో సినిమాకి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే చేసారు.
అయితే బ్రో సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగులు కనిపించలేదని ఫాన్స్ అంటున్నారు.వీరి కాంబినేషన్ లో మాస్ డైలాగులు, గుర్తిండిపోయే లైన్స్ ని ఊహించి వెళ్లిన అభిమానులు నిరాశకు గురయ్యారట.

అయితే దీనికి కారణం డైరెక్టర్ సముద్రఖని( Samudrkhani ) అంటూ కామెంట్స్ వస్తున్నాయి.సినిమా త్వరగా కంప్లీట్ చేయాలని అనుకోవడంతో త్రివిక్రమ్ కి టైం ఇవ్వలేదని, అందుకే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ రాయలేకపోయారని చెబుతున్నారు.సినిమా బాగున్నప్పటికీ, పవన్ స్టైల్ బాగున్నప్పటికీ త్రివిక్రమ్ డైలాగ్స్ లేకపోవడంతో పవన్ అభిమానులు నిరాశ గాని వెనక్కి వచ్చారు.ఇలా జరగడానికి డైరెక్టర్ కారణమని కామెంట్లు పెడుతున్నారు.







