Raj Kundra : నా భార్య నిద్రపోయాక మరదలితో అలాంటి పని చేస్తాను: రాజ్ కుంద్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి ( Shilpa Shetty )గురించి మనందరికీ తెలిసిందే.శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా( Rajkundra ) గురించి కూడా మనందరికీ తెలిసిందే.

 Raj Kundra Parties Shamita After His Wife Shilpa Shetty Sleeps Old Video Viral-TeluguStop.com

ఆ మధ్య పోర్నో గ్రఫీ కేసులో భాగంగా రాజ్‌కుంద్రా పేరు మార్మోగిన సంగతి మనందరికీ తెలిసిందే.కొద్దిరోజుల పాటు ఎక్కడ చూసినా కూడా అతని పేరే వినిపించింది.

ఆ సమయంలో రాజ్‌కుంద్రా కూడా మీడియాకు ముఖం చూపించడం ఇష్టం లేక మాస్కు ధరించే తిరుగుతున్నాడు.ఎప్పుడు బయట కనిపించినా ఏదో ఒక కొత్తరకం మాస్కుతోనే బయట దర్శనమిస్తున్నాడు.

అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె చెల్లితో కలిసి పార్టీలకు తిరుగుతున్నానని గతంలో ఒక షోలో వెల్లడించాడు.తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.ఈ వీడియోలో రాజ్‌ కుంద్రా తన భార్య శిల్పా శెట్టి, మరదలు షమితా శెట్టితో కలిసిఒక షోకి హాజరయ్యాడు.ఈ సందర్భంగా రాజ్‌కుంద్రా మాట్లాడుతూ.శిల్పా శెట్టిని చేసుకోవడం వల్ల నాకు చాలా కలిసొచ్చింది.పెళ్లైన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేది.

పార్టీలు గట్రా నచ్చేవి కావు.రాత్రి 9 అవగానే నిద్రపోయేది.

నాకు ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలనిపిస్తే ఆమె చెల్లెలిని పిలిచేవాడిని.తను నో చెప్పకుండా తోడు వచ్చేది.అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్లాలంటే నా మైండ్‌లోకి ముందు షమిత( Shamita ) పేరే వస్తుంది.అదే ఇంట్లో ఉండాలి, పుస్తకాలతో కాలక్షేపం చేయాలనుకున్నప్పుడు శిల్ప మదిలో మెదులుతుంది.

అందుకే షమితాకు త్వరగా పెళ్లవాలని నేను కోరుకోను అని చెప్పుకొచ్చాడు.కాగా శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రాల నిశ్చితార్థం 2009 ఫిబ్రవరిలో జరిగింది.

అదే ఏడాది నవంబర్‌ 22న పెళ్లి చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube