ఏదైనా పాము( Snake ) కనిపించగానే మనం వెంటనే చేసే పని దానికి చంపేయడం.కర్ర లేదా బండలు తీసుకుని కొట్టి పాముని చంపేస్తూ ఉంటాం.
కానీ ఒక వ్యక్తి పాముని చంపేసే వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో చాలామందికి నవ్వుని తెప్పిస్తుంది.ఈ వీడియోలో ఒక వ్యక్తి చీపురు పట్టుకుని పాముని చంపేసే ప్రయత్నం చేశాడు.
చీపురు పట్టుకుని పామును చంపుతుండటం తెగ నవ్వు తెప్పిస్తుంది.ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.
ఇది నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంది.

ఒక యువకుడు పాముని చీపురు( Broom )తో చంపడానికి ప్రయత్నిస్తున్నాడు.కానీ పాము చీపురుకు అందకుండా పోతుంది.చీపురుతో కొడుతుండగా పైకి పైకి దూకడానికి ప్రయత్నిస్తుంది.
పాము కూడా చాలా చిన్నదే.కాలువ ఒడ్డున కనిపించిన పామును చంపడానికి యువకుడు చీపురుతో ప్రయత్నాలు చేస్తుండగా.
అది త్వరగా పారిపోతుంది.చీపురును క్రికెట్ బ్యాట్ లా చేసి బాల్ ని కొట్టినట్లు పామును కొట్టాడు.
దీంతో ఆ పాము మరొక యువకుడిపై పడింది.దీంతో ఆ యువకుడు భయంతో గంతులేశాడు.
అతడు వేసిన గంతులు మరింత నవ్వు తెప్పించేలా ఉన్నాయి.
అయితే యువకుడు చీపురుతో పామును కొడుతుండగా.
అది దూకడానికి ప్రయత్నాలు చేస్తోంది.దీనిని అక్కడే ఉన్న కొంతమంది యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో వీడియో కాస్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.పాముని చంపాలంటే బలమైన కర్ర, లేదా బండరాయిని ఉపయోగిస్తారు.
కానీ చిపురుతో పాముని చంపాలని ఇతడు చేసిన ప్రయత్నం నవ్వులు పూయిస్తుంది.పామును చూడగానే ఎవరికైనా భయం వేస్తుంది.
కానీ ఇతడు చేసిన పని చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది.వీడికి అసలు తెలివి లేదనుకుంటా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
పాముని ఎలా చంపాలనేది తెలుసుకోవాలని మరికొందరు అంటున్నారు.మొత్తానికి ఇతడు చేసిన పని మాత్రం కామెడీగా ఉంది.







