సోషల్ మీడియా అనేది విస్తృతంగా పెరిగిపోయింది.డంజన్ల కొద్ది యాప్ లు పుట్టుకొస్తున్నాయి.
వీటిని కొంతమంది మంచి కోసం ఉపయోగించుకుంటే.మరికొందరు టైమ్ పాస్ కోసం వినియోగించుకుంటున్నారు.
తమకు తెలిసిన నాలెడ్జ్‌ను ఇతరులకు షేర్ చేస్తూ కొంతమంది పాపులర్ అవుతుంటే.మరికొంతమంది తమలోని నటనను బయటపెడుతుంటారు.
సినిమాలోని సాంగ్స్, డైలాగ్ లు, డ్యాన్స్ లను రీషూట్ చేస్తూ ఉంటారు.ఇలా తమలోని టాలెంట్ ను బయటపెడుతూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతూ ఉంటారు.

తాజాగా ఒక బాలిక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.గ్లిజరిన్( Glycerin ) లేకుండానే కన్నీళ్లు పెడుతుంది.దీంతో బాలిక నటనను అందరూ మెచ్చుకుంటున్నారు.బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ నటించిన దేవదాస్ సినిమా( Devadas Movie ) సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
ఆ సినిమాలోని ఓ సీన్ ను బాలిక రీషూట్ చేసింది.ఇందులో బాలిక అద్భుతంగా నటించింది.సినిమాలోని ఒక డైలాగ్ చెబుతూ మధ్యలో కన్నీళ్లు పెట్టింది.సన్నివేశానికి తగ్గట్లు కన్నీళ్లు పెట్టుకుంది.

సినిమా షూటింగ్స్ లలో ఎమోషనల్ సీన్లు( Emotional Scenes ) ఉన్నప్పుడు కన్నీళ్లు తెప్పించడానికి గ్లిజరిన్ వాడతారు.కానీ అలాంటిది ఏమీ వాడకుండానే ఈ బాలిక కన్నీళ్లు పెట్టింది.దీంతో యువతి నటనకు అందరూ ఫిదా అవుతున్నారు.మరో మహానటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.చిన్న వయస్సులోనే అద్భుతంగా నటిస్తుందని, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని మరికొందరు అంటున్నారు.సినిమాలో కూడా ఈమె లాగా ఎవరూ నటించలేదేమో అంటూ మరికొందరు కితాబిస్తున్నారు.
పాపకు మంచి భవిష్యత్ ఉందని, సినిమాల్లో బాగా ఉపయోగపడుతుందంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.వావ్ బాలిక నటన అద్బుతంగా ఉందని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.
ఇలా ఎవరికి వారు తమ కామెంట్లతో ఈ బాలికపై పొగడ్తలు కురిపిస్తున్నారు.బాలిక వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.







