అది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన జూ పార్కు... వివ‌రాలు పూర్తిగా తెలిస్తే..

అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జంతుప్రదర్శనశాల.అక్క‌డ జంతువులు స్వేచ్ఛగా తిరుగుతాయి.

 The Worlds Most Dangerous Zoo In China Details, China Zoo, Lehe Ledu Zoo, Danger-TeluguStop.com

మ‌నుషులు బోనులలో ఉంటారు.జంతువులను కాకుండా మనుషులను బోనుల్లో బంధించి, జంతువులు స్వేచ్ఛగా సంచరించే జూని మీరు ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు అటువంటి జూ గురించి తెలుసుకుందాం.అలాంటి జూ చైనాలో ఉంది.జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్న చోట మనుషుల‌ను బోనులో బంధిస్తారు.ఈ జూ పేరు లేహె లేడు వైల్డ్‌లైఫ్. ఇక్కడ జంతువులు స్వేచ్ఛగా సంచరించడం చూడవచ్చు.

ఈ ప్రత్యేకమైన జూ చైనాలోని చాంగ్‌కింగ్ నగరంలో ఉంది.ఈ చైనా జూ 2015లో ప్రారంభ‌మ‌య్యింది.

లేహె లేడు వైల్డ్‌లైఫ్ జూ అనే జూలో మనుషులు.జంతువులకు దగ్గరయ్యే అవకాశం క‌నిపిస్తుంది.ఇక్కడ పర్యాటకులు తమ చేతులతో జంతువులకు ఆహారం కూడా ఇవ్వవచ్చు.ఈ జూలో మనుషులతో నిండిన బోనులను జంతువుల చుట్టూ తిప్పుతారు.

జంతువులు మ‌నుషుల‌ను తినడానికి బోను దగ్గరకు వ‌స్తాయి.ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు మనుషులు గ‌ట్టిగా కేక‌లు వేస్తారు.

మా సందర్శకులకు అత్యంత విభిన్నమైన, థ్రిల్లింగ్ అనుభూతిని అందించాలనుకుంటున్నామని జూ పోషకులు చెబుతున్నారు.

Telugu Animals, Chan Liyang, China Zoo, Zoo, Leheledu, Lehe Ledu Zoo, Strange Zo

జూ ప్రతినిధి చాన్ లియాంగ్ మాట్లాడుతూ ఒక జంతువు మిమ్మల్ని వెంబడించినప్పుడు లేదా అది దాడి చేసినప్పుడు.అప్పటి అనుభవాలను ప్ర‌త్య‌క్షంగా అనుభూతి చెందేలా చేయాలనుకుంటున్నాం.ఈ జూలో మీరు సింహం, బెంగాల్ టైగర్, తెల్ల పులి, ఎలుగుబంటి వంటి ప్రమాదకరమైన జంతువులను దగ్గరి నుండి చూడవ‌చ్చు.

వారు కోరుకున్న అనుభవాలను వారు అనుభూతి చెందేలా చేయాలనుకుంటున్నామ‌న్నారు.వింటుంటూనే అద్భుతంగా అనిపిస్తున్న ఈ జూను ప్ర‌త్య‌క్షంగా చూసేవారి అనుభూతి ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube