రాక్షస మానవులు ఈ భూమిపై ఉన్నారని ఎప్పటి నుంచో ఒక నమ్మకం ఉంది.అటువంటి మానవుల కథలు దాదాపు అన్ని మతాల గ్రంథాలలో కనిపిస్తాయి.
అటువంటి మానవులకు సంబంధించిన శిలాజాలు, అస్థిపంజరాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఖననం చేసిన స్థితిలో కనిపించాయి.ఇది నిజంగా అలాంటి వ్యక్తులు భూమిపై ఉండేవారని రుజువు చేస్తుంది.
జెయింట్స్ గురించి చాలా వాదనలు ఉన్నాయి.రాక్షస మానవుల ఉనికి గురించి ఆలోచించేలా చేసే కొన్ని ఆవిష్కరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి 2012లో 15 అంగుళాల మానవ వేలి ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి.అయితే ఈ వేలు మమ్మీగా ఎక్కడ దొరికింది? ఎవరి వద్ద ఉంది? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.ఈ వేలు గురించిన వార్త మొదట జర్మన్ వెబ్‌సైట్‌లో ప్రచురితమయ్యింది.దీని ప్రకారం ఈ ఆనవాళ్ల చిత్రాన్ని ఈజిప్టులో 1988లో గ్రెగర్ స్పోరి తీశారు.అప్పుడు సమాధులు, పిరమిడ్లలో దొంగతనానికిపాల్పడిన వ్యక్తి అతనికి ఈ వేలును చూపించాడు.
ఈ చిత్రాన్ని తీయడానికి అతను $ 300 డాలర్లు చెల్లించాల్సి వచ్చింది.కొన్నాళ్ల తర్వాత ఆ వ్యక్తి కోసం వెతికినా కనిపించలేదు.2008లో జార్జియాలోని కాకసస్ పర్వతాల నుండి కొన్ని పెద్ద ఎముకలను కనుగొన్నారు.దీని సైజును బట్టి అది మనిషికి చెందినదైతే 8 నుంచి 10 అడుగుల ఎత్తు ఉండేదని అంచనా వేశారు.ప్రముఖ శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ వెకువా వీటిపై పరిశోధనలు చేస్తూనే హఠాత్తుగా మరణించారు.
ఆ తర్వాత ఈ ఎముకలు కూడా మ్యూజియం నుంచి మాయమయ్యాయి.రాళ్ల రూపంలో పెద్ద పాదముద్రలు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాలలో కనుగొన్నారు.
వాటిని భారీ ఆది మానవులకు సాక్ష్యంగా భావిస్తారు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కార్బన్ డేటింగ్ ఆధారంగా, వారిలో చాలా మంది వయస్సు మిలియన్ల సంవత్సరాలుగా ఉంటుందని తేలింది.
ఇదే నిజమైతే ప్రపంచంలో మనిషి చరిత్ర తిరగరాయాల్సిందే.అటువంటి పెద్ద పాదాలలో అత్యంత ప్రసిద్ధమైనది దక్షిణాఫ్రికాలో కనిపించే గోలియత్ పాదముద్ర.
స్వాజిలాండ్ సరిహద్దులోని మ్ప్లూజీ టౌన్‌లో కనుగోన్న ఈ పాదముద్ర దాదాపు 4 అడుగుల పొడవు ఉంటుంది.ఇది 200 మిలియన్ సంవత్సరాల నాటిదని కూడా చెబుతారు.







