భారత జట్టును ఊరిస్తున్న ప్రపంచ రికార్డు.. అలా జరిగితే తిరుగుండదు!

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి 4 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది.ఈ బోర్డర్-గవాస్కర్ సిరీస్ తొలి టెస్టు నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది.

 The World Record Of Defeating The Indian Team,india, Australia, Viral Latest, Ne-TeluguStop.com

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ బెర్తు భారత్‌ను ఊరిస్తోంది.భారత జట్టుకు ఈ టెస్టు సిరీస్ చాలా ముఖ్యమైనది.

టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 2-0 తేడాతో ఆస్ట్రేలియాను ఓడిస్తే, అప్పుడు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ మొదటి స్థానానికి చేరుకుంటుంది.ఇప్పటికే భారత్ వన్డేలలో, టీ20లలో మొదటి ర్యాంకులో కొనసాగుతోంది.

టెస్టు సిరీస్‌లోనూ విజయం సాధిస్తే అన్ని ఫార్మాట్లలో నంబర్ 1 జట్టుగా మారే అరుదైన అవకాశం లభించనుంది.దీంతో ఈ టెస్టు సిరీస్‌పై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది.

Telugu Australia, Icc, India, Nagpur, Latest-Latest News - Telugu

ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియాకు మెరుగైన స్థితిలోనే ఉంది.భారత జట్టు 115 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది.ఆస్ట్రేలియా జట్టు మొదటి ర్యాంకులో ఉంది.ఈ పరిస్థితుల్లో టెస్ట్ ఫార్మాట్‌లో నంబర్ 1 ర్యాంకును పొందడానికి టీమ్ ఇండియాకు గొప్ప అవకాశం ముందుంది.ఇదే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ బెర్తు ఖాయం చేసుకోవడానికి భారత్‌కు ఈ టెస్టు సిరీస్ సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు.

Telugu Australia, Icc, India, Nagpur, Latest-Latest News - Telugu

ఇందులో రెండు టెస్టులను గెలుచుకున్నా భారత్ ఫైనల్ చేరుకుంటుంది.టెస్ట్ సిరీస్‌ను 3-1 తేడాతో లేదా 4-0తో గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది.వన్డేలలో 114 రేటింగ్ పాయింట్లతో భారత్ జట్టు తొలి ర్యాంకులో కొనసాగుతోంది.టీ20లలో సైతం మొదటి ర్యాంకులో కొనసాగుతోంది.267 రేటింగ్ పాయింట్లు భారత్ ఖాతాలో ఉన్నాయి.న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన తర్వాత తొలి ర్యాంకు పదిలం అయింది.త్వరలో జరగనున్న టెస్టు సిరీస్‌లోనూ భారత్ విజయం సాధిస్తే మూడు ఫార్మాట్లలోనూ తొలి ర్యాంకులో కొనసాగే అరుదైన అవకాశం భారత్‌కు లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube